Lashkar e Taiba: భారత్ వ్యతిరేకులకు.. వైట్ హౌస్‌లో కీలక పదవులు
ABN , Publish Date - May 19 , 2025 | 01:25 PM
Lashkar e Taiba: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో శిక్షణ పొందిన వ్యక్తితోపాటు ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉండి.. ప్రజలను రెచ్చగొట్టేలా చేసిన మరో వ్యక్తికి వైట్ హౌస్‌లో కీలక పదవులు కట్టబెట్టారు.
వాషింగ్టన్, మే 19: పహల్గాం ఉగ్రదాడికి తామే బాధ్యులమంటూ లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ సంస్థ ది రిసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అలాంటి సమయంలో యూఎస్ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరగకుండా తాను నిరోధించానంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉగ్రవాద సంస్థతో అనుబంధం కలిగిన ఇద్దరిని రిలీజియస్ లిబర్టీ కమిషన్‌లో చోటు కల్పిస్తూ వైట్ హౌస్ సలహా మండలి శనివారం నిర్ణయం తీసుకుంది.
ఇస్మాయిల్ రోయర్, షేక్ హాంజా యూసఫ్‌లకు అందులో చోటు కల్పిస్తూ.. శనివారం వైట్ హౌస్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇస్మాయిల్ రోయర్.. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో శిక్షణ పొందాడు. ఇక మరొకరు షేక్ హాంజా యూసఫ్.. ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడి.. పలువురిని తీవ్రంగా ప్రభావితం చేశాడనే అభియోగాలున్నాయి.

ఎవరీ ఇస్మాయిల్ రోయర్..
ఇస్మాయిల్ రోయర్ అసలు పేరు రాండల్ టోడ్ రోయర్. 1992లో అతడు ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. అందులోనే అతడు తన కెరీర్‌ను మలుచుకున్నాడు. ఆ తర్వాత 20వ దశకం ప్రారంభంలో పాకిస్థాన్‌కు పయనమయ్యాడు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో శిక్షణ పొందాడు. 2008లో ముంబై దాడులతోపాటు కాశ్మీర్‌లోని సైనికులు, భద్రతా దళాలపై దాడులు చేసే బాధ్యతలను ఇస్మాయిల్ రోయర్‌కు లష్కరే ఈ తోయిబా కట్టెబెట్టింది.
ఇక 2003లో అమెరికాపై యుద్దం చేయడానికి కుట్రపన్నడంతో పాటు ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడంతో అతడిపై కేసులు నమోదయ్యాయి. అలాగే 2004లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా.. వినియోగం కేసులో అతడు.. తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడికి కోర్టు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దీంతో 2017లో అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. వర్జినియా జిహాద్ నెట్‌వర్క్‌లో సభ్యుడిగా కొనసాగుతూన్నారు.
షేక్ హంజా యూసుఫ్ ఎవరు?
ఇక షేక్ హంజా యూసుఫ్.. ఈయన పాశ్చాత్య ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ఇస్లామిక పండితునిగా ఖ్యాతి పొందారు. యూఎస్‌లోని మొట్టమొదటి గుర్తింపు పొందిన ముస్లిం లిబరల్ ఆర్ట్స్ కళాశాల.. జైతునా కళాశాలకు సహా వ్యవస్థాపకుడిగా ఆయన కొనసాగుతున్నారు. అలాగే బర్కిలీలోని సెంటర్ ఫర్ ఇస్లామిక్ స్టడీస్‌కు సలహాదారుడిగా కూడా పని చేశారు. అదే విధంగా యూఎస్ దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో విదేశాంగ శాఖలో షేక్ హంజా యూసుఫ్ కీలక పదవిని చేపట్టారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండి.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో హంజా యూసుఫ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 2016లో ఛార్జీ షీట్ నమోదు చేసింది.
వీరి నియామకంపై తీవ్ర వ్యతిరేకత..
అయితే వీరి నియామకాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజకీయ నాయకుడు లౌరా లూమర్ మాట్లాడుతూ.. ఇది పిచ్చి పని అని అభివర్ణించారు. అంతేకాదు ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యమైనది కాదని పేర్కొన్నారు. వీరి నియామకంపై జరిగిన నిర్ణయంలో డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఉండకపోవచ్చుననే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Kadiri Municipality: కదిరి మున్సిపల్ చైర్ పర్సన్‌గా దిల్షాద్ ఉన్నీసా
Vizianagaram: బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం.. వెలుగులోకి సంచలన విషయాలు
GVMC Dy Mayor: జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా.. ఎందుకంటే..
For National News And Telugu News