ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rules Ignored: వెంకట్రామిరెడ్డి గీత దాటారు

ABN, Publish Date - May 10 , 2025 | 03:19 AM

వైసీపీకి అనుకూలంగా ప్రవర్తించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వెంకట్రామిరెడ్డి‌పై అభియోగాలు నిర్ధారణ కాగా, ప్రభుత్వంలో ఉన్న అనుచరుల వల్ల చర్యలు ఆలస్యం అయ్యాయి. చార్జిషీట్లు నమోదైనా జీఏడీ గప్‌చుప్‌ వ్యవహారం అధికారులు విమర్శకు లోనవుతోంది

  • అభియోగాలు నిర్ధారించిన కడప కలెక్టర్‌

  • ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసుల్లో చార్జిషీట్లు.. రోసా రూల్స్‌ ఉల్లంఘనపై

  • జీఏడీ గప్‌చుప్‌.. ఆ ఊసే లేకుండా చేసిన ఆయన సహచరులు

  • జగన్‌ వీరభక్తుడిని కాపాడే యత్నాలు.. సచివాలయ ఉద్యోగ వర్గాల్లో చర్చ

అమరావతి, మే 9 (ఆంధ్రజ్యోతి): గత ఎన్నికల్లో బహిరంగంగానే వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసిన ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌కు వీరవిధేయుడు, పరమభక్తుడైన కె.వెంకట్రామిరెడ్డిపై నమోదైన అభియోగాలు రుజువైనట్లు పంచాయతీరాజ్‌ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఏపీ కాండక్ట్‌ నిబంధనలు.. (19(1),(5), 3(1),(2)ను ఆయన ఉల్లంఘించారని కడప కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ తన నివేదికలో ధ్రువీకరించినట్లు సమాచారం. సంబంధిత రిపోర్టును ఆయన 25 రోజుల క్రితమే ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. అలాగే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరులో ఎన్నికల అధికారులు పోలీసు కేసులు నమోదు చేశారు. వీటిపై చార్జిషీట్లు నమోదైనట్లు సమాచారం. 2024 మార్చి 31న ఈ నాలుగు చోట్ల వెంకట్రామిరెడ్డి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకుడు చంద్రయ్యతో కలిసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసి కోడ్‌ను ఉల్లంఘించారు. ఇందుకుగాను 2024 మార్చి 18న ఆయన్ను సస్పెండ్‌ చేశారు. వెంకట్రామిరెడ్డి పంచాయతీరాజ్‌ శాఖలో సెక్షన్‌ అధికారి.


ప్రస్తుతం ఇన్‌చార్జి అసిస్టెంట్‌ పోస్టులో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే గాక టీడీపీ కూటమి సర్కారు వచ్చాక కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు ఊరట లభిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ప్రభుత్వం మారినప్పుడు తొలుత ఆయనపై అభియోగాలు నమోదు చేయలేదు. పైగా ఏకంగా సస్పెన్షన్‌ ఎత్తివేతను ప్రతిపాదిస్తూ ఫైలు పెట్టారు. విషయం బయటకు పొక్కడంతో ఆ ఫైలును ఆపేసి అభియోగాలు నమోదు చేస్తూ గత ఏడాది ఆగస్టు 21న జీవో ఇచ్చారు. 10 రోజుల్లో దీనిపై వెంకట్రామిరెడ్డి వివరణ ఇవ్వకపోతే నేరుగా శాఖాపరమైన చర్యలు నేరుగా తీసుకుంటామని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత రోసా రూల్స్‌ వర్తించకుండా ఉండేలా ఆ ఫైలును జీఏడీకి పంపారు. జీఏడీలో ఉన్న ఆయన అనుచర ఉద్యోగులు రోసా రూల్స్‌ ఉల్లంఘనల ఊసే లేకుండా చేశారు. అలాగే కోడ్‌ ఉల్లంఘన కేసుల్లో చార్జిషీట్లు దాఖలైనట్లు ప్రభుత్వానికి నివేదిక అంది 25 రోజులైనా ఇప్పటివరకు కదలిక లేదు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో వైసీపీ వీరభక్తుడిని ఇంతలా కాపాడాల్సిన అవసరం ఏముందో ప్రభుత్వ పెద్దలకే తెలియాలని ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మిస్ వరల్డ్ 2025 వేడకలు..

ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్

పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్

For More AP News and Telugu New

Updated Date - May 10 , 2025 | 03:19 AM