Pawan Kalyna: ఆవిర్భావ దినోత్సవ వేళ.. పలువురు నేతలకు కీలక బాధ్యతలు
ABN, Publish Date - Feb 24 , 2025 | 10:04 PM
Pawan Kalyna: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి, ఫిబ్రవరి 24: గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలో నిలిపిన 21 మంది అభ్యర్థులు ఘన విజయం సాధించారు. చంద్రబాబు సారథ్యంలో కొలువు తీరిన ప్రభుత్వంలో ఆ పార్టీ కీలక భాగస్వామి అయింది. అలాంటి వేళ.. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాని స్థానిక ఎమ్మెల్యే, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
అందులోభాగంగా ఈ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. అందుకోసం.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ఆయన నియామించారు. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు, పీ.ఓ.సీలు, మండలాధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి.. పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసేలా కీలక బాధ్యతలు అప్పగించారు.
పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు
శ్రీకాకుళం: కొరికన రవి కుమార్
విజయనగరం: లోకం నాగ మాధవి
విశాఖపట్నం: సిహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్
అనకాపల్లి: పంచకర్ల రమేశ్ బాబు
అరకు: వంపూరు గంగులయ్య
కాకినాడ: తుమ్మల రామస్వామి
రాజమండ్రి: యర్నాగుల శ్రీనివాసరావు
అమలాపురం: బండారు శ్రీనివాసరావు
నరసాపురం: కొటికలపూడి గోవిందరావు
ఏలూరు: రెడ్డి అప్పల్నాయుడు
మచిలీపట్నం: బండి రామకృష్ణ
విజయవాడ: సామినేని ఉదయభాను
గుంటూరు: గాదె వెంకటేశ్వర రావు
బాపట్ల: వడ్రాణమ్ మార్కండేయబాబు
నరసరావుపేట: కిలారు రోశయ్య
ఒంగోలు: షేక్ రియాజ్
నెల్లూరు: వేములపాటి అజయ కుమార్
కడప: తాతంశెట్టి నాగేంద్ర
రాజంపేట: అతికారి కృష్ణ
కర్నూలు: చింతా సురేష్
నంద్యాల: నయుబ్ కమల్
అనంతపురం: టి.సి.వరుణ్
హిందూపురం: చిలకం మధుసూదన్ రెడ్డి
చిత్తూరు: డా.పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి: ఆరణి శ్రీనివాసులు
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: మహిళ కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
Also Read: ట్యాపింగ్ కేసు.. కాంగ్రెస్ వదిలినా.. బీజేపీ వదలదు
Also Read: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
Also Read: మీ పాన్ కార్డులో ఇది మీరు ఎప్పుడైనా గమనించారా?
Also Read: జగన్‌కి ఝలక్ ఇచ్చిన అసెంబ్లీ.. మేటర్ ఏంటంటే..
Also Read: రైతులకు అలర్ట్.. డబ్బులు పడ్డాయోచ్.. మీ అకౌంట్ చెక్ చేసుకోండి..
Also Read: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Also Read: కాంగ్రెస్ అగ్రనేతలకు అంజన్న మాస్ వార్నింగ్
Updated Date - Feb 24 , 2025 | 10:04 PM