Share News

PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. డబ్బులు పడ్డాయోచ్.. మీ అకౌంట్ చెక్ చేసుకోండి..

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:36 PM

PM Kisan Yojana: ప్రధాన మంత్రి కిసాయ్ యోజన పథకంలో భాగంగా 19వ విడత నగదును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.

PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. డబ్బులు పడ్డాయోచ్.. మీ అకౌంట్ చెక్ చేసుకోండి..

పాట్నా, ఫిబ్రవరి 24: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద 19 వ విడత నగదును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. సోమవారం బిహార్‌లోని భాగల్‌పూర్‌లో రూ. 22 వేల నగదును ప్రధాని మోదీ విడుదల చేశారు. దీని ద్వారా 9.80 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఇక 18వ విడతలో.. 2023, అక్టోబర్ 5వ తేదీన మహారాష్ట్రలోని వాషిమ్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ నగదు విడుదల చేశారు. ఈ విడతలో దాదాపు 9 కోట్ల మంది రైతల ఖాతాల్లో రూ. 20 వేల కోట్ల నగదు జమ అయిన విషయం విధితమే.

రైతులకు పెట్టబడి, ఆర్థిక సాయంతోపాటు వారి జీవనోపాధిని మెరుగు పరచాలనే సదుద్దేశ్యంతో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో.. ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. అది కూడా మూడు విడతలుగా.. రూ. 2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 19 విడతల్లో దాదాపు రూ. 2 లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాలకు నగదును కేంద్రం జమ చేస్తోంది.


పీఎం కిసాన్ లబ్ధిదారులు.. వారి జాబితాను ఇలా చూసుకోండి..

రైతులు తమ గ్రామం, జిల్లా, రాష్ట్రం ఆధారంగా PM-KISAN యోజన లబ్ధిదారుల జాబితాను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. లభ్యమయ్యే సమాచారాన్ని తెలుసుకోవాలంటే.. ఈ క్రింది విధంగా వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా PM - KISAN అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించాల్సి ఉంటుంది.

ఆ తర్వాత నో యూవర్ స్టేటస్‌పై క్లిక్ చేయ్యాలి.

అక్కడ మీరు నమోదు చేసిన రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్న సమాచారం మీకు చూపిస్తుంది.

జాబితాలో మీ పేరు ఉంటే మీరు ఈ పథకం కింద ఆర్థిక సహాయం మీ ఖాతాలో పడుతోంది.

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: జగన్‌కి ఝలక్ ఇచ్చిన అసెంబ్లీ.. మేటర్ ఏంటంటే..

Also Read: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

For National News And Telugu News

Updated Date - Feb 24 , 2025 | 04:53 PM