Share News

Miyapur Police: మహిళ కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు

ABN , Publish Date - Feb 24 , 2025 | 09:27 PM

Miyapur Police: మహిళను కిడ్నాప్ చేసి.. ఆపై రేప్ చేసిన కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ బైక్‌తోపాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Miyapur Police: మహిళ కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు

హైదరాబాద్, ఫిబ్రవరి 24: మియాపూర్‌లో మహిళను కిడ్నాప్ చేసి ఆపై రేప్ చేసిన కేసును స్థానిక పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులు.. చందానగర్‌కు చెందిన బల కుమార్, మహేష్‌లను అరెస్ట్ చేశామని ఏసీపీ శ్రీనివాసకుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి యాక్టివా బైక్‌తోపాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఫిబ్రవరి 21వ తేదీన 100 డయల్‌కు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు.

ఇద్దరు వ్యక్తులు వచ్చి.. మహిళ‌ను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఈ ఫిర్యాదును నిర్ధారించుకుని 3 గంటల వ్యవధిలో కిడ్నాప్‌నకు గురైన మహిళను కాపాడామని చెప్పారు. మహిళను కిడ్నాప్ చేసిన ఇద్దరు నిందితులను వెంటనే తాము గుర్తించామన్నారు.

అయితే ఈ ఇద్దరు నిందితులపై పాత కేసులు సైతం ఉన్నాయని ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాసకుమార్ వెల్లడించారు. కిడ్నాప్‌నకు గురైన మహిళపై నిందితులు ఇద్దరు అత్యాచారం చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించామని ఏసీపీ శ్రీనివాసకుమార్ చెప్పారు.

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ట్యాపింగ్ కేసు.. కాంగ్రెస్ వదిలినా.. బీజేపీ వదలదు

Also Read: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Also Read: మీ పాన్ కార్డులో ఇది మీరు ఎప్పుడైనా గమనించారా?

Also Read: జగన్‌కి ఝలక్ ఇచ్చిన అసెంబ్లీ.. మేటర్ ఏంటంటే..

Also Read: రైతులకు అలర్ట్.. డబ్బులు పడ్డాయోచ్.. మీ అకౌంట్ చెక్ చేసుకోండి..

Also Read: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Also Read: కాంగ్రెస్ అగ్రనేతలకు అంజన్న మాస్ వార్నింగ్

For Telangana News And Telugu News

Updated Date - Feb 24 , 2025 | 09:28 PM