Kishan Reddy: ట్యాపింగ్ కేసు.. కాంగ్రెస్ వదిలినా.. బీజేపీ వదలదు
ABN , Publish Date - Feb 24 , 2025 | 09:00 PM
Kishan Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుప్పించిన విమర్శలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాస్తా ఘాుటుగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ వదిలేసినాా.. బీజేపీ మాత్రం వదలదని కుండ బద్దలు కొట్టారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసు ఎలా ముందుకు వెళ్లదో తాము చూస్తామన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ పార్టీ వదిలినా.. బీజేపీ మాత్రం వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. చీకటి ఒప్పందాలు చేసుకునే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు.
మజ్లీస్, బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలతోనే కాకుండా దేశ వ్యతిరేక శక్తులతో సైతం ఈ కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందాలు చేసుకుందని గుర్తు చేశారు. బీజేపీ ఏం చెబుతుందో.. అదే చేస్తుందని.. ఏం చేస్తుందో అదే చెబుతామని ఆయన పేర్కొన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు తాము బెదరమన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు అనుమతిని రేవంత్ రెడ్డి సీఎం కాకముందే తాను తీసుకు వచ్చానని.. అలాంటి తనపైనే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
ముఖ్యమంత్రి స్థాయి దిగజారి మరీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని చెప్పారు. ఆయనలాగా తాము మాట్లాడలేమన్నారు. తమకు కొద్దో గొప్పో నైతిక విలువలు ఉన్నాయని చెప్పారు. ఆ క్రమంలో ఎన్నో దశాబ్దాలుగా ఇదే పార్టీలో ఉండి.. ఇదే జెండాను మోస్తున్నామని వివరించారు. రేవంత్ రెడ్డిలాగా తాను పార్టీలు మారలేదని.. గంటకో మాట మాట్లాడలేదన్నారు.
Also Read: మీ పాన్ కార్డులో ఇది మీరు ఎప్పుడైనా గమనించారా?
దెయ్యమన్నా సోనియాగాంధీ వద్దకు వెళ్లి దేవతంటూ ఆమె కాళ్లు పట్టుకోలేదంటూ రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి చురకలంటించారు. తనలాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు. యువతకు సీఎం రేవంత్ ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మారింది పాలకులు మాత్రమే కానీ.. పాలన కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనదైన శైలిలో విమర్శించారు.
Also Read: జగన్‌కి ఝలక్ ఇచ్చిన అసెంబ్లీ.. మేటర్ ఏంటంటే..
పాలనలో రెండు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. మార్చి 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్ని్కల్లో బీజేపీ కోసం తామంతా తీవ్రంగా కష్టపడ్డామని చెప్పారు. అందుకే రేవంత్ రెడ్డి కడుపు మంటగా ఉందన్నారు.
Also Read: రైతులకు అలర్ట్.. డబ్బులు పడ్డాయోచ్.. మీ అకౌంట్ చెక్ చేసుకోండి..
ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును తీసుకు వచ్చేందుకు విదేశాల్లో ఏమైనా బీజేపీ ప్రభుత్వం ఉందా? అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి చురకలంటించారు. తాము ఎవరితో కుమ్మక్కయ్యామో చెప్పాలని సీఎం రేవంత్‌కూ నిలదీశారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Also Read: కాంగ్రెస్ అగ్రనేతలకు అంజన్న మాస్ వార్నింగ్
మార్చి 27వ తేదీన తెలంగాణలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అంటే జనవరి 24వ తేదీన మూడు జిల్లాల్లో సూడిగాలి పర్యటన చేపట్టారు. ఆ క్రమంలో ఆయన పాల్గొన్న బహిరంగ సభల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తనదైన శైలిలో రేవంత్ రెడ్డి విరుచుకు పడ్డారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి పై విధంగా స్పందించారు.
For Telangana News And Telugu News