ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ABN AndhraJyothy: నంద్యాలలో ‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా’ సక్సెస్ మీట్.. పాల్గొన్న మంత్రి ఫరూక్

ABN, Publish Date - Jul 02 , 2025 | 02:12 PM

నంద్యాల వైఎస్సార్‌నగర్‌లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ’అక్షరమే అండగా పరిష్కారమే అజెండాగా’ సక్సెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండీ ఫరూక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి మంత్రి ఫరూక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ABN AndhraJyothy Program

నంద్యాల: నంద్యాల వైఎస్సార్‌నగర్‌లో ఇవాళ(బుధవారం) ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN AndhraJyothy Program) ‘అక్షరమే అండగా పరిష్కారమే అజెండాగా’ సక్సెస్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండీ ఫరూక్ (Minister NMD Farooq) హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ‘అక్షరమే అండగా పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం నిర్వహిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఫరూక్.

నంద్యాల శివారులో టీడీపీ ప్రభుత్వంలో 110 ఎకరాల భూమిని కొనుగోలు చేసి నందమూరి నగర్‌ను ఏర్పాటు చేశామని మంత్రి గుర్తుచేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చామని... కానీ అవసరాల కోసం కొందరు అమ్ముకున్నారని అన్నారు. చాలామంది ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నారని కానీ మున్సిపల్ అధికారులు ఇంటి పన్నులు వేయడం లేదని తెలిపారు. ఈ సమస్యని ‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ద్వారా తన దృష్టికి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి తీసుకువచ్చిందని గుర్తుచేశారు మంత్రి ఫరూక్.

నందమూరి నగర్, వైఎస్సార్ నగర్ కాలనీల్లోని నివాస గృహాలకు ఇంటి పన్నులు వేయాలని మున్సిపల్ కమిషనర్‌ను మంత్రి ఫరూక్ ఆదేశించారు. నందమూరినగర్, వైఎస్సార్ నగర్ వాసులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని మాటిచ్చారు. రెండు కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారని... ప్రజా సమస్యలను పట్టించుకోరని మండిపడ్డారు. ఇప్పుడేమో మళ్లీ పాదయాత్ర చేస్తానంటున్నారని. ఆయనను చూసి జనం నవ్వుకుంటున్నారని మంత్రి ఫరూక్ ఎద్దేవా చేశారు.

ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలి: ఎన్ఎండీ ఫిరోజ్

జనవరిలో వైఎస్సార్‌ నగర్‌లో ’అక్షరమే అండగా పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం నిర్వహించామని నంద్యాల జిల్లా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ తెలిపారు. ఆరునెలల్లో నందమూరి, వైఎస్సార్ నగర్ కాలనీల్లో రూ. 3 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశామని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ఎమ్మెల్యే శిల్పారవి కిషోర్ రెడ్డి తన ఇంటి దగ్గర మాత్రమే రోడ్లు వేయించుకొని ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో నందమూరినగర్, వైఎస్సార్ నగర్ కాలనీల రూపు రేఖలు మారుస్తామని మాటిచ్చారు. తమను ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని.. ప్రజలకు సేవ చేసే బాధ్యత తమపై ఉందని ఉద్ఘాటించారు. ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని ఎన్ఎండీ ఫిరోజ్ సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్, వార్డు ఇన్‌చార్జ్‌లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం

రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు

For More AP News and Telugu News

Updated Date - Jul 02 , 2025 | 02:26 PM