PVN Madhav: పవన్ కల్యాణ్‌పై కేసు.. పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Jul 02 , 2025 | 02:45 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ నేతలపై తమిళనాడులో కేసు పెట్టడం మురుగన్‌పై దాడిగా భావిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అన్నామలైకి అండగా పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగారని పీవీఎన్ మాధవ్ చెప్పుకొచ్చారు.
విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), బీజేపీ నేతలపై తమిళనాడు ప్రభుత్వం కేసు పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వంపై మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్, బీజేపీ నేతలపై తమిళనాడులో కేసు పెట్టడం మురుగన్‌పై దాడిగా భావిస్తామని అన్నారు. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఓటమి తథ్యమని తెలిపారు పీవీఎన్ మాధవ్.
దుర్మార్గపు పాలన తమిళనాడులో ఉందని విమర్శించారు. సనాతన ధర్మం నాశనం అయిపోవాలని, వేదాంగాలపైన నీచమైన ఆలోచన కలిగిన ప్రభుత్వం తమిళనాడులో ఉందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(బుధవారం) విజయవాడలో జాతీయ హిందూ ధార్మిక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు, మాధవ్, గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడారు. అన్నామలైకి అండగా పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగారని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్, అన్నామలైకి తాము అండగా ఉంటామని పీవీఎన్ మాధవ్ ఉద్ఘాటించారు.
గోమాతను జాతీయ జంతువుగా గుర్తించాలి: స్వామి శ్రీనివాసానంద సరస్వతి
గోమాతను జాతీయ జంతువుగా గుర్తించాలని స్వామి శ్రీనివాసానంద సరస్వతి సూచించారు. ఉత్తరాదిలో చాలా దేవాలయాలు మద్యం, మాంస రహితంగా ఉన్నాయని వెల్లడించారు. తిరుమల, తిరుపతిలను కూడా మద్యం, మాంస రహితంగా చేయాలని కోరారు. తిరుమల తిరుపతిని పవిత్రంగా ఉంచి.. టెంపుల్ సిటీగా ప్రకటించాలని సూచించారు. అయోధ్యలాగా తిరుపతి తిరుమలను మద్యం, మాంస రహితంగా, అన్యమత ప్రచార రహితంగా చేయాలని అన్నారు. దేవాలయాల భూములు, ఆస్తులను సంరక్షించాలని స్వామి శ్రీనివాసానంద సరస్వతి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం
రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు
For More AP News and Telugu News
Updated Date - Jul 02 , 2025 | 02:54 PM