ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: విజయవాడలో భారీగా గంజాయి పట్టివేత..దాని విలువ ఎంతంటే..

ABN, Publish Date - Jun 25 , 2025 | 09:16 PM

విజయవాడ నగరంలో బుధవారం సీపీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రూ.15 లక్షలు విలువైన 200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి బెజవాడకు తీసుకువస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Vijayawada Police Drug Seizure

విజయవాడ: నగరంలో ఇవాళ(బుధవారం) సీపీ రాజశేఖర్ బాబు (CP Rajasekhar Babu) ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రూ.15 లక్షలు విలువైన 200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి బెజవాడకు గంజాయిని తీసుకువస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు మీడియాకు వెల్లడించారు. విశాఖపట్నం ఏజెన్సీ నుంచి తమిళనాడుకు గంజాయి తీసుకువెళ్తున్నారని అన్నారు. ఒరిస్సా వద్ద తక్కువకు గంజాయి కొని, తమిళనాడులో ఎక్కువ అమ్ముతున్నారని చెప్పారు సీపీ రాజశేఖర్ బాబు.

గంజాయిని గూడ్స్ వాహనంలో తరలిస్తుండగా నాగరాజు, అనురాగన్ సెండ్రిసోలన్‌ అనే నిందితులను పట్టుకున్నామని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. గూడ్స్ వాహనం, కారుని నిందితుల దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది 31 వేల వాహనాలు సీజ్ చేశామని, 141 నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణాను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తరచూ వాహనాలు తనిఖీ చేసి పట్టుకుంటున్నామని అన్నారు సీపీ రాజశేఖర్ బాబు.

కాలేజ్, స్కూల్స్‌లో ఈగల్ టీంలు ఏర్పాటు చేశామని సీపీ రాజశేఖర్ బాబు వివరించారు. ఇటీవల MDMA డ్రగ్స్‌ని కూడా పట్టుకున్నామని చెప్పుకొచ్చారు. విద్యార్థులు గంజాయి తాగడాన్ని గుర్తించామని.. వారిని మార్చే క్రమంలో డీ‌ అడిక్షన్ చేయిస్తున్నామని చెప్పారు. గంజాయి కొనుగోలు చేసే కొన్ని విద్యాసంస్థలను గుర్తించామని చెప్పుకొచ్చారు. ఈగల్ టీంల ద్వారా వాటిని నియంత్రణ చేస్తామని అన్నారు. డ్రగ్స్ గురించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడంలో ప్రజల పాత్ర కీలకమని చెప్పారు. గంజాయి వల్ల‌ కలిగే నష్టాల గురించి అందరిలో చర్చ సాగాలని అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ‌ పిల్లలపై దృష్టి పెట్టి, గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రణాళిక బద్దంగా ఏపీలో గంజాయిని నిరోధించేలా చర్యలు చేపడుతున్నామని సీపీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

కేంద్ర కేబినెట్‌లో చంద్రబాబు, లోకేష్‌ను మెచ్చుకున్న ప్రధాని

ప్రతీ కార్యకర్తను గౌరవిస్తాం: మంత్రి కొల్లు

Read latest AP News And Telugu News

Updated Date - Jun 25 , 2025 | 10:20 PM