ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఈఏసీ కీలక భేటీ

ABN, Publish Date - Jun 17 , 2025 | 03:56 PM

Banakacherla Project: పోలవరం - బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్‌ షా, సీఆర్‌ పాటిల్‌కు అనేకసార్లు వినతి చేశారు కూడా. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తొలి అడుగుపడింది.

Banakacherla Project

న్యూఢిల్లీ, జూన్ 17: బనకచర్ల ప్రాజెక్ట్‌పై (Banakacherla Project) కేంద్ర పర్యావరణ నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ) ఈరోజు (మంగళవారం) భేటీ అయ్యింది. పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రొఫెసర్ చక్రపాణి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు అయ్యింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ కమిటీ సమావేశమైంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వ (AP Govt) ప్రతిపాదనలను ఈ కమిటీ పరిశీలించనుంది. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని కమిటీ అంచనా వేయనుంది.

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీతో (PM Modi) పాటు కేంద్రమంత్రులు అమిత్‌ షా, సీఆర్‌ పాటిల్‌కు అనేక సార్లు వినతి చేశారు కూడా. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తొలి అడుగుపడింది. బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఈఏసీ కీలక సమావేశం ప్రారంభమైంది. ప్రాజెక్ట్ చేపట్టడం వల్ల జరిగే పర్యావరణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నదానిపై కమిటీ అంచనా వేయనుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తదుపరి అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ సమావేశాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

అయితే బనకచర్ల ప్రాజెక్ట్‌ను పూర్తిగా అనుమతింకూడదని, రిజెక్ట్ చేయాలంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy).. ఈఏసీకి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని తెలిపారు. గోదావరి నీటిని కృష్ణలో కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీని వల్ల తెలంగాణ హక్కులను హరించినట్లు అవుతుందని... ఈ ప్రాజెక్ట్‌కు ఏమాత్రం అనుమతులు ఇవ్వొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో నేటి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను ఈఏసీ ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది, ఈ ప్రాజెక్ట్‌‌కు పర్యావరణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కేంద్రానికి కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. పోలవరం - బనకచర్ల ప్రాజెక్టులతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని పంప్‌డ్‌ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లపైనా ఈ కమిటీ సమావేశం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

బెంగళూరు ఎయిర్‌పోర్టు పోలీసుల అదుపులో చెవిరెడ్డి..

సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం

మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 04:23 PM