Chevireddy AP SIT: బెంగళూరు ఎయిర్‌పోర్టు పోలీసుల అదుపులో చెవిరెడ్డి..
ABN , Publish Date - Jun 17 , 2025 | 02:40 PM
Chevireddy AP SIT: మద్యం ముడుపులతో లింక్ ఉండటంతో చెవిరెడ్డిని మద్యం కేసులో నిందితుడిగా చేర్చింది సిట్. ఇప్పటికే చెవిరెడ్డిపై వారం క్రితమే లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొలంబో వెళ్తున్నారని సిట్ అధికారులు చెబుతున్నారు.
అమరావతి, జూన్ 17: వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని (Former MLA Chevireddy Bhaskar Reddy) బెంగళూరు ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూర్ నుంచి కొలంబో వెళ్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు (బుధవారం) ఉదయం ఆయన బెంగళూరు నుంచి కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఏపీ లిక్కర్ స్కాంలో ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు ఉండటంతో ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయంపై ఏపీ పోలీసులకు కెంపెగౌడ విమానాశ్రయ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో తిరుపతి నుంచి ఏపీ సిట్ అధికారులు బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో చెవిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు.
బెంగుళూరు నుంచి ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికి చెవిరెడ్డిని విజయవాడకు తీసుకురానున్నారు అధికారులు. మద్యం కుంభకోణంలో రేపు ఉదయం చెవిరెడ్డి అరెస్ట్‌ను చూపనున్నారు సిట్ అధికారులు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీ, తెలంగాణ సరిహద్దులో జగ్గయ్య పేట సమీపంలోని ఓ టోల్‌గేట్ వద్ద 8 కోట్ల 20 లక్షల రూపాయలు కారులో తీసుకువస్తూ చెవిరెడ్డి పీఏ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అప్పట్లోనే ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది. మద్యం ముడుపులను హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు తరలించడంలో చెవిరెడ్డి మనుషులు కీలక పాత్ర పోషించారని సిట్‌కు సమాచారం అందింది.
ఈ నేపథ్యంలో చెవిరెడ్డి గన్‌మెన్‌లను, వ్యక్తిగత సిబ్బంది దగ్గర ఇప్పటికే స్టేట్‌మెంట్‌లు రికార్డు చేశారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా.. చెవిరెడ్డి గన్ మెన్ ఒకరు ఈరోజు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. తమతో బలవంతంగా స్టేట్‌మెంట్ రాయించారని, అలాగే చెవిరెడ్డి పాత్ర ఉన్నట్లు చెప్పమన్నారని పోలీసులపై ఫిర్యాదు చేశారు. అయితే ఈరోజు చెవిరెడ్డి కొలొంబో వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే చెవిరెడ్డిపై వారం క్రితమే లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొలంబో వెళ్తున్నారని సిట్ అధికారులు చెబుతున్నారు. కొలంబో వెళ్తుండగా బెంగుళూరు ఎయిర్పోర్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. రేపు సాయంత్రం విజయవాడ కోర్ట్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా.. మద్యం ముడుపులతో లింక్ ఉండటంతో చెవిరెడ్డిని మద్యం కేసులో నిందితుడిగా చేర్చింది సిట్.
అయితే మద్యం కుంభకోణం కేసులో డిస్ట్లరీల నుంచి కలెక్షన్ వసూలు చేసిన కేసిరెడ్డి రాజశేఖరెడ్డి, అతని గ్యాంగ్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉందంటూ మాజీ సీఎం జగన్ సెక్రటరీగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్పలను సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు తొలిసారిగా మద్యం కేసులో ఓ రాజకీయ నాయకుడిని, జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధుపులోకి తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
Read Latest AP News And Telugu News