Jagan Batch High Court: మద్యం కుంభకోణం కేసులో ఆ ముగ్గరికి ఎదురుదెబ్బ
ABN, Publish Date - May 02 , 2025 | 11:35 AM
Jagan Batch High Court: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించి ముగ్గురు జగన్ బ్యాచ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగలింది.
అమరావతి, మే 2: ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) జగన్ (Former CM YS Jagan) బ్యాచ్‌కు హైకోర్టులో (AP High Court) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ సీఎం జగన్ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వివరాలు సమర్పించేందుకు ప్రాసిక్యూషన్ సమయం కోరింది. ఈ క్రమంలో ప్రాసిక్యూషన్ సమయం కోరుతున్న నేపథ్యంలో ఈ దశలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం వచ్చే బుధవారానికి (మే 7)కి వాయిదా వేసింది.
మద్యం స్కాంలో ఇప్పటికే అరెస్ట్ అయిన కొందరు నిందితులు తమ పేర్లు చెప్పారని, అందువల్ల తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. కాగా.. మద్యం స్కాం కేసులో లోతుగా విచారణ జరుగుతుండటంతో జగన్ బ్యాచ్‌లో వణుకు మొదలైంది. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి, ఆయన పీఏ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసు తమ వరకు రాబోతోందన్న భయంతో హైకోర్టులో పిటిషన్ వేశారు జగన్ బ్యాచ్. తమకు అరెస్ట్ లేకుండా చూడాలంటూ ముందస్తు బెయిల్‌కు అప్పీలు చేసుకున్నారు.
Gopi ACB Custody: రెండో రోజు ఏసీబీ కస్టడీకి గోపి
జగన్ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఎలాంటి ముందస్తు అరెస్ట్ లేకుండా ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మంది నుంచి సిట్ అధికారులు సమాచారాన్ని రాబట్టారు. మరికొంత మంది విచారణ కూడా జరుగుతోంది. ఈ కేసులో మరికొంత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేయగా.. వారికి ఎదురుదెబ్బ తగిలింది.
ఇవి కూడా చదవండి
CM Chandrababu: ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం..
Amaravati Re Launch: దారులన్నీ అమరావతి వైపే.. పెద్ద సంఖ్యలో జనం రాక
Read Latest AP News And Telugu News
Updated Date - May 02 , 2025 | 11:52 AM