ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pulivendula Tension: పులివెందులలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు

ABN, Publish Date - May 28 , 2025 | 04:04 PM

Pulivendula Tension: పులివెందులలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీడీపీ మహానాడు సందర్భంగా పులివెందులలో తెలుగు తమ్ముళ్లు పార్టీ జెండాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైసీపీ పార్టీకి చెందిన వారు నానా బీభత్సం సృష్టించారు.

Pulivendula Tension

కడప, మే 28: జిల్లాలో ఓ వైపు టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతున్న వేళ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. దీంతో పులివెందుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మహానాడు సందర్భంగా పులివెందులలో టీడీపీ శ్రేణులు పార్టీ జెండాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు తమ అక్కసును బయటపెట్టారు. పులివెందులలో తెలుగు తమ్ముళ్లు ఏర్పాటు చేసిన తెలుగుదేశం మహానాడు జెండాలను, బ్యానర్లను వైసీపీ శ్రేణులు పీకేశారు. అయితే టీడీపీ శ్రేణుల మాత్రం ఎలాంటి గొడవలకు పోకుండా.. వైసీపీ తీసివేసిన జెండాలను, బ్యానర్ల‌ను తిరిగి కట్టుకున్నారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. ‘మళ్లీ పీకుతాం ఏమి చేస్తారో చేసుకోండి’ అంటూ బ్యానర్లను పీకేసేందుకు సిద్ధమయ్యారు.


ఇందులో భాగంగా పులివెందుల వైసీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు భారీగా గుమిగూడారు. వైసీపీ శ్రేణుల హంగామా నేపథ్యంలో టీడీపీ కార్యాలయం వద్దకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ పరిస్థితులను గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.


మరోవైపు పులివెందులలో వైసీపీ బీభత్సం గురించి తెలుసుకున్న టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి మహానాడు ప్రాంగణం నుంచి పులివెందులకు బయలుదేరి వెళ్లారు. పులివెందులలో టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు పీకి వేయడంపై అక్కడ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. వైసీపీ పీకేసిన జెండాలను టీడీపీ కార్యకర్తలు కట్టినప్పటికీ మళ్లీ పీకేస్తామంటూ హడావుడి చేస్తూ పులివెందుల వైసీపీ ఆఫీసుకు ఆ పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే బీటెక్‌ రవి పులివెందులకు బయలుదేరారు. టీడీపీ కార్యాలయం వద్దకు రవి వస్తున్నాడని తెలిసి తెలుగు దేశం టీడీపీ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకుంటున్నారు. తాను పులివెందుల వెళ్ళి తేల్చుకుంటానని బీటెక్ రవి చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి

మహానాడు వేదికగా వారికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

ఎన్టీఆర్‌కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 04:49 PM