TDP Mahanadu 2025: మహానాడు వేదికగా వారికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
ABN, Publish Date - May 28 , 2025 | 01:28 PM
CBN Warns: మహానాడు వేదికగా కోవర్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా.. ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు.
కడప, మే 28: ‘నేరస్థులూ ఖబడ్దార్.. నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను ’ అంటూ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) హెచ్చరించారు. రెండో రోజు మహానాడు ప్రారంభమవగా.. సీఎం మాట్లాడుతూ.. నేరస్థులకు అల్టిమేటం జారీ చేశారు. కొంతమంది టీడీపీలో ఉండి కోవర్టులుగా పని చేస్తున్నారని.. వారి ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మన వేలుతో మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ వారు సొంత పార్టీ వారినే చంపుకుంటారంటూ పార్టీకి చెడ్డపేరు తెచ్చి.. సులభంగా వారి టార్గెట్‌లను హత్య చేస్తున్నారని కోవర్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది నేరస్థులు చేసే కనికట్టు మాయ అని అన్నారు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా.. ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. కోవర్టులను టీడీపీలోకి పంపించి.. ఆ కోవర్టుల ద్వారా మీ అజెండా నెరవేర్చుకోవడం సాధ్యం కాదన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి గుండెపోటు అని చెప్పారని.. రెండవ రోజు నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళ పేపర్‌లో వేశారని మండిపడ్డారు. ఇటువంటి నరరూప రాక్షసులతో రాజకీయం చేస్తున్నామన్నారు. పల్నాడులో హత్యలు చేస్తున్నారని.. వీటిపై తనకు అనుమానం కలిగిందన్నారు. పల్నాడులో వీరయ్య చౌదరి హత్య తరువాత.. ఇప్పుడు తాను ఎవరినీ నమ్మడం లేదన్నారు. వలస పక్షులు వస్తుంటాయ్.. వెళుతూ ఉంటాయని... కానీ నిజమైన కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారని అన్నారు. పార్టీ బలోపేతం కావాలని.. అదే సమయంలో కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఇంకా పకడ్బంధీగా కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
తెలుగు జాతికి పండుగ రోజు.. మహానాడులో ఏపీ సీఎం
ఎన్టీఆర్‌కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి
Read Latest AP News And Telugu News
Updated Date - May 28 , 2025 | 02:07 PM