Pawan Kalyan: మహిళలపై అలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు.. పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్
ABN, Publish Date - Mar 08 , 2025 | 11:32 AM
Pawan Kalyan: స్త్రీ సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల మూలంగా మహిళలకు ఆర్థికపరమైన అంశాలపై అవగాహన మెరుగవుతోందని తెలిపారు.
అమరావతి: సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తు శిల్పి... స్త్రీ మూర్తి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. తన కుటుంబాన్ని చక్కదిద్దడం నుంచి పరిపాలన, కార్యనిర్వహణ, వాణిజ్య వ్యాపారాలు, పరిశ్రమల నిర్వహణ వరకూ ప్రతి విభాగంలో మహిళామణులు తమ బాధ్యతను దిగ్విజయంగా పోషిస్తున్నారని కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి స్వరూపిణి అయిన ప్రతి స్త్రీమూర్తికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేదుకు అవసరమైన అండదండలు అందిస్తుందని అన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి 11.5 లక్షల మందికి దాదాపుగా రూ.4 వేల కోట్ల ప్రయోజనాలు కలిగించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాల ద్వారా అతివలు అధిక శాతం లబ్ధి పొందారని పవన్ కల్యాణ్ చెప్పారు.
స్త్రీ సంక్షేమానికి కృషి..
‘స్త్రీ సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలు చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌లకు ధన్యవాదాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల మూలంగా మహిళలకు ఆర్థికపరమైన అంశాలపై అవగాహన మెరుగవుతోంది. అతివలు ఆర్థికంగా బలోపేతం అయితే కచ్చితంగా ప్రతి కుటుంబం తద్వారా సమాజం బహుముఖంగా సంపన్నం అవుతుంది. ఈ క్రమంలోనే వారి రక్షణ బాధ్యతలు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా తీసుకుంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ రూపాల్లో మహిళల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడే ప్రతి ఒక్కరిపైనా కఠినంగా వ్యవహరిస్తాం. మహిళల రక్షణ, సంక్షేమం మా ప్రభుత్వ బాధ్యత’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Chandrababu Naidu: మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా ఏపీ
Venkaiah Naidu: ఉన్నత విద్యలో మార్పుతోనే దొరస్వామికి నివాళి
Power Tariff: విద్యుత్ ట్రూ అప్ పాపం వైసీపీదే
Read Latest AP News and Telugu News
Updated Date - Mar 08 , 2025 | 11:39 AM