Venkaiah Naidu: ఉన్నత విద్యలో మార్పుతోనే దొరస్వామికి నివాళి
ABN , Publish Date - Mar 08 , 2025 | 06:05 AM
పీఈఎస్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు ప్రొఫెసర్ ఎంఆర్ దొరస్వామి పార్థివదేహాన్ని బెంగళూరులో శుక్రవారం ఆయన దర్శించి, నివాళులు అర్పిం చారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
అధికార లాంఛనాలతో దొరస్వామి అంత్యక్రియలు
బెంగళూరు, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యలో మార్పులు తీసుకురావడం ద్వారానే దొరస్వామికి ఘన నివాళులు అర్పించినట్టు అవుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నా రు. పీఈఎస్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు ప్రొఫెసర్ ఎంఆర్ దొరస్వామి పార్థివదేహాన్ని బెంగళూరులో శుక్రవారం ఆయన దర్శించి, నివాళులు అర్పిం చారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. దొరస్వామితో తనకు దశాబ్దాలుగా సన్నిహిత సంబంధం ఉందని, తాము కలిసిన ప్రతిసారి ఉన్న త విద్య అంశంపై చర్చించుకునేవారమని తెలిపా రు. కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ, ఏపీ ఎమ్మెల్యేలు గురజాల జగన్, భానుప్రకాశ్, అమిలినేని సురేంద్రబాబు సహా పలు విద్యాసంస్థల ప్రముఖులు దొరస్వామికి ఘన నివాళులు అర్పించారు. బనశంకరిలోని ఆయ న నివాసం నుంచి హనుమంతనగర్ క్యాంప్‌సకు పార్థివ దేహాన్ని శుక్రవారం తీసుకువచ్చారు. అక్కడి నుంచి బనశంకరిలోని శ్మశానవాటికదాకా ఊరేగింపుగా తీసుకెళ్లారు. అధికార లాంఛనాలతో కుమారుడు జవహర్ దొరస్వామి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి...
Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..
Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ
Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..
Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..