Share News

CM Stalin: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ

ABN , Publish Date - Mar 07 , 2025 | 04:15 PM

CM Stalin: లోక్ సభ స్థానాల పునర్విజనకు కేంద్రం కసరత్తు చేస్తున్న వేళ.. తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికాక దక్షిణాది రాష్ట్రాలను ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులోభాగంగా ఆయా రాష్ట్రాల సీఎంలతోపాటు మాజీ సీఎంలను ఆయన లేఖ రాశారు.

CM Stalin: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం..  సీఎంలకు లేఖ
Tamilnadu CM MK Stalin

న్యూఢిల్లీ, మార్చి 07: వచ్చే ఏడాది లోక్‌సభ పునర్విభజన జరగనుంది. అలాంటి వేళ తమిళనాడు సీఎం, డీఏంకే అధినేత ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులోభాగంగా నియోజకవర్గాల పునర్విభజనపై జేఏసీ ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలకు సీఎం స్టాలిన్ శుక్రవారం లేఖ రాశారు. ఈ జేఏసీలో తమ పార్టీ అభ్యర్థులను సూచించాలని ఆ లేఖలో సీఎంలు, మాజీ సీఎంలకు ఆయన సూచించారు. అలాగే మార్చి 22 వ తేదీ చెన్నయిలో ఈ జేఏసీ తొలి సమావేశం జరగనుందని ఆ లేఖలో సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. అదే విధంగా ఈ సమావేశానికి హాజరు కావాలని ఆ లేఖలో వారికి సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్నాటక, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకు ఆయన ఈ లేఖలు రాశారు.


లోక్‌సభ స్థానాల పునర్విభజనతో దక్షిణాదిలో ఆ స్థానాల సంఖ్య తగ్గనున్నాయని.. అలాగే ఉత్తరాధిలో వాటి సంఖ్య గణనీయంగా పెరగనున్నాయంటూ ఓ ప్రచారం అయితే వాడి వేడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు తమిళనాడులో ప్రస్తుతం 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయని.. పునర్విభజన అనంతరం వాటి సంఖ్య 31కి చేరుతోందంటూ సీఎం స్టాలిన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో తమిళనాడు 8 లోక్ స్థానాలను0 కొల్పోనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందులోభాగంగా మార్చి తొలి వారంలో ఈ అంశంపై చర్చించేందుకు చెన్నయిలో అఖిల పక్ష సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. కానీ బీజేపీ మాత్రం ఈ సమావేశానికి డుమ్మా కొట్టిన విషయం విధితమే.


ఇంకోవైపు సీఎం స్టాలిన్ చేసిన ఈ కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఆ మరునాడే కోయంబత్తురు పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. పునర్విభజన అనంతరం దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గించే ప్రయత్నం అయితే ఏమీ జరగదని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. ప్రధాని మోదీ సైతం ఇదే అంశాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదీకాక మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలంటూ విభజించే ప్రయత్నం చేస్తుందంటూ గత కొద్ది రోజులుగా ఓ వాదన సాగుతోంది. అంతేకాకుండా.. ఉత్తరాదిలో లోక్ సభ స్థానాలను పెంచడం ద్వారా.. దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు సైతం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారనే ఓ చర్చ అయితే సాగుతోంది.

For National News And Telugu News

Updated Date - Mar 07 , 2025 | 04:40 PM