వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..

నువ్వులు, బెల్లంతో కలిపి తీసుకుంటే శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వీటిలో పొటాషియం, సోడియం, ఐరన్ తదితర పోషకాలు ఉంటాయి. పిల్లల పోషణలో నువ్వులు, బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తాయి. 

వేయించిన నువ్వులు.. బెల్లం కలిపి తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతోంది.  

రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతోన్న వారు.. ఐరన్‌ తక్కువగా ఉన్నవారు ఒక చెంచా వేయించిన నువ్వులు,బెల్లం కలిపి తింటే మంచిది.

రోజుకు ఒక చెంచా నువ్వులు,బెల్లం కలిపి తింటే బరువు తగ్గుతారు.

నువ్వులు,బెల్లం తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ త్వరగా తగ్గిపోతుంది.ఇది సహజంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది.