రోజూ తలస్నానం చేస్తే ఏమౌతుంది

రోజూ తలస్నానం ఆరోగ్యానికి మంచిదా.. కాదా

ప్రతీరోజూ హెడ్‌బాత్ వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి

జిడ్డు చర్మం ఉన్నావారికి ఇది ఉపశమనం అని చెప్పుకోవచ్చు

తలస్నానం చేస్తే జిడ్డు పోయి వెంట్రుకలు శుభ్రంగా ఉంటాయి

వ్యాయామం, శారీరక శ్రమ, కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండే వారు తలస్నానం చేయాల్సిందే

కానీ రోజూ తలస్నానంతో లాభాలకంటే నష్టాలే ఎక్కువ

రోజూ తలస్నానంతో సహజ నూనెలు పూర్తిగా తొలగిపోతాయి

వెంట్రుకలు పొడిబారి నిర్జీవంగా మారుతాయి

డ్రైహెయిర్ ఉన్నవారు రోజూ తలస్నానం చేయకపోవడం ఉత్తమం

జిడ్డు చర్మం, జిడ్డు వెంట్రుకలు ఉన్నవారు రోజు విడిచి రోజు స్నానం చేయొచ్చు

పొడి చర్మం, పొడి వెంట్రుకలు ఉన్నవారు వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే హెడ్‌బాత్ చేయాలి