రోజూ నారింజ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. 

నారింజ పండులోని విటమిన్‌-సి.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయం చేస్తుంది. 

నారింజ పండులోని ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహకరిస్తుంది.

శరీరంలో మంటను తగ్గిండంలోనూ దోహదం చేస్తుంది. 

నారింజలోని పొటాషియం కంటెంట్.. బీపీ అదుపులో ఉండేలా చేస్తుంది. 

కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలోనూ నారింజ సాయం చేస్తుంది. 

తరచూ నారింజ పండు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవు.

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.