ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: పల్నాడు జిల్లాలో అమానుష ఘటన.. నవ వధువుపై అత్యాచారయత్నం

ABN, Publish Date - Jun 26 , 2025 | 08:41 PM

పల్నాడు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. నవవధువుపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అమరావతి మండలం అత్తలూరులో 20 రోజుల క్రితం ఆమెకి వివాహమైంది. వివాహం అయినప్పటి నుంచి నలుగురు యువకులు వివాహితను వేధిస్తున్నారు. భర్త ఇంటిలో లేని సమయంలో భార్యపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు.

Palnadu District Case

పల్నాడు: జిల్లాలో అమానుష ఘటన జరిగింది. నవవధువుపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అమరావతి (Amaravati) మండలం అత్తలూరులో 20 రోజుల క్రితం ఆమెకి వివాహమైంది. వివాహం అయినప్పటి నుంచి నలుగురు యువకులు వివాహితను వేధిస్తున్నారు. భర్త ఇంటిలో లేని సమయంలో భార్యపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అత్యాచారయత్నం చేస్తున్న సమయంలో మరో యువకుడు వీడియో రికార్డింగ్ చేశాడు. అదే సమయంలో భర్త ఇంటికి వచ్చాడు.

భర్తను చూసి యువకులు ఘర్షణ పడ్డారు. అనంతరం అక్కడి నుంచి యువకులు పారిపోయారు. ఈ ఘటనతో ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వైద్యపరీక్షల నిమిత్తం బాధితురాలని గుంటూరు జీజీహెచ్‌‌కి కుటుంబ సభ్యులు తరలించారు. ఆమెకి జీజీహెచ్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అమరావతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత నిందితులు పరారీ అయ్యారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యువకులపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరారు.

ఇవి కూడా చదవండి:

జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు..

For More AP News and Telugu News

Updated Date - Jun 26 , 2025 | 08:55 PM