ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Nara Lokesh: నీట్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు

ABN, Publish Date - Jun 15 , 2025 | 10:00 AM

నీట్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేశస్థాయిలో నిర్వహించిన పోటీపరీక్షలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు.

AP Minister Nara Lokesh

అమరావతి: నీట్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (AP Minister Nara Lokesh) తెలిపారు. వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాల్లో టాప్-100లో రాష్ట్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించడంపై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

19వ ర్యాంకు సాధించిన డి.కార్తీక్ రామ్ కిరీటి, 56వ ర్యాంకు సాధించిన కె.మోహిత శ్రీరామ్, 59వ ర్యాంకు సాధించిన డి.సూర్యచరణ్, 64వ ర్యాంకు సాధించిన పి.అవినాష్, 70వ ర్యాంకు సాధించిన వై.సమీర్ కుమార్, 92వ ర్యాంకు సాధించిన టి.శివమణిదీప్‌లకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. దేశస్థాయిలో నిర్వహించిన పోటీపరీక్షలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభతో జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. వైద్య వృత్తి ద్వారా భవిష్యత్‌లో ప్రజలకు సేవలందించాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి:

విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఎ పరీక్షలు

19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర: ఇస్రో

For More AP News and Telugu News

Updated Date - Jun 15 , 2025 | 10:05 AM