AP News: ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
ABN, Publish Date - May 17 , 2025 | 03:48 PM
AP Kabaddi Association Elections: ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శనివారం నాడు ఎన్నుకున్నారు. ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అన్వేష్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్‌లు అబ్జర్వర్లుగా ఈ ఎన్నిక జరిగింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ (AP Kabaddi Association) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇవాళ(శనివారం) జరిగిన ఎన్నికల్లో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ప్రభావతి, వైస్ ప్రెసిడెంట్‌గా కృష్ణ, కార్యదర్శిగా యలమంచిలి శ్రీకాంత్‌లను ఎన్నుకున్నారు. అలాగే 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులను యలమంచిలి శ్రీకాంత్ ప్రకటించారు. ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అన్వేష్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్‌లు అబ్జర్వర్లుగా ఈ ఎన్నిక జరిగింది. కబడ్డీ ఆటలో ప్రతిభ కనబరచిన క్రీడాకారుడు మణికంఠకు రూ.3 లక్షల చెక్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా ఏపీ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికైందని తెలిపారు. ఏకేఐఎఫ్(AKIF) వైస్ ప్రెసిడెంట్ అన్వేష్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్‌లు అబ్జర్వర్లుగా ఈ ఎన్నిక జరిగిందని చెప్పారు. ఏపీలో సీఎం చంద్రబాబు ఆదేశించిన విధంగా కబడ్డీని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏకేఐఎఫ్ గైడ్‌లైన్స్ అనుగుణంగా పని చేస్తామని చెప్పారు. త్వరలో బీచ్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తామని యలమంచిలి శ్రీకాంత్ తెలిపారు.
ఖేలో ఇండియాలో మెడల్ గెలిచిన ప్రతి కీడాకారుడికి రూ.5 వేలు బహుమతిగా ఇచ్చామని అన్నారు. మంచి ప్రతిభ కనబరచిన మణికంఠకు రూ. 3 లక్షలు అందజేశామని చెప్పారు. గతంలో కొంతమంది కబడ్డీ క్రీడా అసోసియేషన్ పేరుతో వివాదాలు సృష్టించారని విమర్శించారు. తమ అసోసియేషన్‌కు ఏకేఐఎఫ్ గుర్తింపు ఉందని స్పష్టం చేశారు. తమ అసోసియేషన్‌కు ఏకేఐఎఫ్ సహకారం అందిస్తుందని తెలిపారు. ఏపీలో నిబంధనల మేరకు తమ అసోసియేషన్‌కు మాత్రమే ఏకేఐఎఫ్ గుర్తింపు, అర్హత ఉందని స్పష్టం చేశారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో క్రీడల్లో రాజకీయాలు ఉండవని తేల్చిచెప్పారు. సీఎం చంద్రబాబు ప్రకటించిన నూతన క్రీడా పాలసీ వర్ధమాన క్రీడాకారులకు ఇది ఒక వరమని యలమంచిలి శ్రీకాంత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
CM Chandrababu Congrats Neeraj: నీ విజయం దేశానికే గర్వకారణం.. నీరజ్‌పై సీఎం ప్రశంసల జల్లు
Pak PM Shehbaz Sharif: భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
Read Latest AP News And Telugu News
Updated Date - May 17 , 2025 | 03:55 PM