Pak PM Shehbaz Sharif: భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ABN , Publish Date - May 17 , 2025 | 11:10 AM
Pak PM Shehbaz Sharif: యుద్ధం సందర్భంగా భారత్ .. పాక్ ఏయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన నుర్ ఏయిర్ బేస్‌ను కూడా పేల్చేసింది. తాజాగా, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ మిస్సైల్స్ పాక్ ఏయిర్ బేస్‌లను ధ్వంసం చేయటంపై స్పందించారు.

న్యూఢిల్లీ: పాక్ అధికారులకు, ప్రజలకు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఊహించని షాక్ ఇచ్చారు. తమపై భారత్ మిస్సైల్స్, డ్రోన్ల దాడులు జరగలేదని పాక్ ఇన్నిరోజులు ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారం అంతా ఒట్టిదేనని పాక్ ప్రధాని చెప్పకనే చెప్పారు. భారత్ దాడిలో కీలక ఎయిర్ బేస్ ధ్వంసమైనట్లు ప్రకటించారు. పాక్ ఆయువు పట్టు నూర్ ఏయిర్ బేస్‌పై భారత్ మిస్సైల్స్ దాడి నిజమేనని ఆయన స్వయంగా చెప్పారు. తాజాగా జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ..
‘ మే 10వ తేదీ తెల్లవారుజామున జనరల్ అసిఫ్ మునిర్ నాకు ఫోన్ చేశారు. భారత్ మిస్సైల్స్ దాడి చేసిందని అన్నారు. ఓ మిస్సైల్ నూర్ ఖాన్ ఏయిర్‌బేస్‌పై పడిందని.. వేరే ప్రాంతాల్లో కూడా మిస్సైల్స్ పేలాయని చెప్పారు’ అని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాళవ్య తన ట్విటర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, మే 7వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడికి సరైన సమాధానం చెప్పడానికి భారత సాయుధ దళాలు సిద్ధమయ్యాయి. పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. తెల్లవారుజామున 1.05 గంటలకు మొదలైన దాడులు 1.30 గంటలకు ముగిశాయి. మొత్తం 25 నిమిషాల్లో విధ్వంసం సృష్టించాయి. భారత్ మిస్సైల్స్ దాడుల్లో ఏకంగా వంద మంది ఉగ్రవాదులు మరణించారు.
ఉగ్రవాద స్థావరాలపై దాడుల నేపథ్యంలో పాక్ ఆర్మీ రెచ్చిపోయింది. ప్రతి దాడులకు దిగింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధం సందర్భంగా భారత్ .. పాక్ ఏయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. పాక్ ఆయువు పట్టు నూర్ ఏయిర్ బేస్‌ను కూడా పేల్చేసింది.
ఇవి కూడా చదవండి
Bengaluru Techie: చిన్న వయసులోనే కోటి సంపాదన.. సీక్రెట్ చెప్పిన టెకీ..
Village Well: మృత్యు బావి.. 8 మందిని బలి తీసుకుందన్న భయంతో..