Bengaluru Techie: చిన్న వయసులోనే కోటి సంపాదన.. సీక్రెట్ చెప్పిన టెకీ..
ABN , Publish Date - May 17 , 2025 | 10:07 AM
Bengaluru Techie: బెంగళూరుకు చెందిన ఆ టెకీ.. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2018లో నెలకు 15 వేల రూపాయల జీతంతో బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఏడాదిన్నరపాటు అక్కడ పని చేసిన తర్వాత వేరే కంపెనీలో ట్రైల్స్ మొదలెట్టాడు.

బెంగళూరు, మే 17: కో అంటే.. కోటి.. కుంటుకుంటు వస్తుంది కొండమీది కోతి... డబ్బుకున్న శక్తిని వివరిస్తూ ఓ సినీ రచయిత ఇలా రాశాడు. మనిషి జీవితంలో వచ్చే 99 శాతం కష్టాలకు పరిష్కారం డబ్బుతోనే దొరుకుతుంది. డబ్బుంటేనే మనుషులకు విలువ ఉంటుంది. అలాంటి డబ్బు సంపాదన కోసం జనం నానా కష్టాలు పడుతుంటారు. ఎంత కష్టపడ్డా .. సంపాదించిన డబ్బులు నెల ఖర్చులకు కూడా సరిపోక అల్లాడిపోతుంటారు. మొత్తం జీవితకాలంలో కోటి రూపాయలు సంపాదించకుండా చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ, కొంతమంది మాత్రం తమ తెలివిని ఉపయోగించి చిన్న వయసులోనే కోట్లు సంపాదిస్తున్నారు.
తాజాగా, బెంగళూరుకు చెందిన ఓ టెకీ 30 ఏళ్లకే ఏకంగా కోటి రూపాయలు సంపాదించాడు. నెలకు 15 వేల జీతంతో ఉద్యోగజీవితాన్ని ప్రారంభించిన అతడు ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. తాను ఎలా కోటీశ్వరుడు అయ్యాడో ఆ టెకీ వివరించాడు. తన విజయ రహస్యాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే.. ఆ టెకీ( పేరు చెప్పలేదు) నిరుపేద కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రుల నెల సంపాదన మొత్తం కలిపితే 13 వేల రూపాయలు ఉంటుంది. చాలీ చాలని సంపాదనతో కుటుంబం మొత్తం బాగా ఇబ్బంది పడేది.
నెలకు 1200 రూపాయల ఫీజుతో అతడు స్కూల్లో చదివాడు. తర్వాత ఇంజనీరింగ్‌లో చేరాడు. కేవలం బస్సు ప్రయాణం కోసం స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కాలేజీలో చేరాడు. కాలేజీ ఫీజు కట్టడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. లోన్లు కూడా దొరకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బంధువులు సాయం చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2018లో నెలకు 15 వేల రూపాయల జీతంతో బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఏడాదిన్నరపాటు అక్కడ పని చేసిన తర్వాత వేరే కంపెనీలో ట్రైల్స్ మొదలెట్టాడు.
సంవత్సరానికి 8 లక్షల రూపాయల జీతంతో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే, కరోనా కారణంగా అంతా నాశనం అయింది. కరోనా పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత 2021లో అద్భుతం జరిగింది. సంవత్సరానికి 12 లక్షల రూపాయల ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. ఉద్యోగంలో చేరాడు. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా జీవితం సాగుతూ ఉంది. అయితే, అతడి జీవితాన్ని ములుపు తిప్పింది మాత్రం స్టాక్ మార్కెట్. యూట్యూబ్ చూసి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశాడు. 2025 నాటికి అతడి సంపాదన మొత్తం కోటి రూపాయలు అయింది. పేద కుటుంబంనుంచి వచ్చి కోటీశ్వరుడిగా మారినా అతడు మాత్రం సాధాసీదా జీవితం గడుపుతున్నాడు.
ఇవి కూడా చదవండి
Village Well: మృత్యు బావి.. 8 మందిని బలి తీసుకుందన్న భయంతో..
Love Affair: ముగ్గురు పిల్లల తల్లితో ప్రేమ.. ఆమె చేసిన పనికి కక్ష గట్టి..