Village Well: మృత్యు బావి.. 8 మందిని బలి తీసుకుందన్న భయంతో..
ABN , Publish Date - May 17 , 2025 | 08:44 AM
Village Well: ఒకే రోజు 8 మంది చనిపోవటం.. అది కూడా ఆ బావి కారణంగా ఎనిమిది మంది చనిపోవటంతో గ్రామస్తులకు భయం పట్టుకుంది. ఆ బావి ఉన్న వైపు వెళ్లటమే మానేశారు. రోజులు గడిచే కొద్ది వారిలో భయం పెరిగిందే కానీ, తగ్గలేదు.

ఈ సృష్టిలో ప్రతీ జీవికి కామన్‌గా ఉండే ఎమోషన్ భయం. ఇతర జీవులతో పోల్చుకుంటే మనుషులకు భయం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందుకే మనుషులు భయం విషయంలో రెండు రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మొదటి రకంలో తమను భయపెట్టే వాటిని అంతం చేస్తారు. రెండో రకంలో భయపెట్టేవాటికి సరెండర్ అయిపోతారు. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ గ్రామం మొత్తం రెండో రకాన్ని ఫాలో అవుతోంది. 8 మంది ప్రాణాలు బలి తీసుకున్న మృత్యు బావికి తలొగ్గింది. బావినుంచి ఎలాంటి ప్రమాదం జరగకూడదని భావించి పూజలు చేయడానికి సిద్ధమైంది.
ఇంతకీ సంగతేంటంటే.. మధ్య ప్రదేశ్, ఖంద్వా జిల్లా, కొందావత్ గ్రామంలో ఓ బావి ఉంది. గంగోర్ పండుగ సందర్భంగా ఆ బావిలో దేవుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని గ్రామస్తులు భావించారు. బావి మురికిగా ఉండటంతో క్లీన్ చేయాలనుకున్నారు. దాన్ని క్లీన్ చేయడానికి ఓ ముగ్గురు వ్యక్తులు లోపలికి దిగారు. బావిని శుభ్రం చేస్తుండగా ఆ ముగ్గురు స్ప్రహతప్పి పడిపోయారు. ఇది గమనించిన ఓ ఇద్దరు వారికి సాయం చేయడానికి కిందకు దిగారు. వాళ్లు కూడా స్ప్రహ తప్పి పడిపోయారు. ఇలా మొత్తం 8 మంది బావిలోకి దిగి చనిపోయారు.
ఒకే రోజు 8 మంది చనిపోవటం.. అది కూడా ఆ బావి కారణంగా ఎనిమిది మంది చనిపోవటంతో గ్రామస్తులకు భయం పట్టుకుంది. ఆ బావి ఉన్న వైపు వెళ్లటమే మానేశారు. రోజులు గడిచే కొద్ది వారిలో భయం పెరిగిందే కానీ, తగ్గలేదు. తమను భయపెడుతున్న బావిని పూడ్చడానికి కూడా వారికి భయం వేసింది. అందుకే బావికి సరెండర్ అయ్యారు. తమకు ఎలాంటి హాని కలిగించవద్దని ప్రాథేయపడుతూ పూజలు చేయటం మొదలెట్టారు. అయితే, పూజలు చేయడానికి కూడా కొంతమంది జనం మొదట భయపడ్డారు. ధైర్యవంతులు ముందుకు కదలటంతో మిగిలిన వాళ్లు కూడా ధైర్యం తెచ్చుకున్నారు. అందరూ కలిసి బావికి పూజలు చేస్తూ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
Love Affair: ముగ్గురు పిల్లల తల్లితో ప్రేమ.. ఆమె చేసిన పనికి కక్ష గట్టి..
Viral Video: భార్యను తలకిందులుగా వేలాడదీసిన భర్త.. కారణం ఏంటంటే..