ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Government:అధికారికంగా ఎన్టీఆర్‌ జయంతి.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ABN, Publish Date - May 27 , 2025 | 09:24 PM

మే 28వ తేదీన దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ఎన్టీఆర్‌ జయంతిని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ విజయానంద్ ప్రత్యేక జీవో జారీ చేశారు.

అమరావతి: మే 28వ తేదీన దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి (NTR Jayanti Celebrations) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ఎన్టీఆర్‌ జయంతిని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ విజయానంద్ జీవోఎంఎస్ నెంబర్ 54ను జారీ చేశారు. దివంగత నేత నందమూరి తారక రామారావు అసాధారణ జీవితం, ఆయన దూరదృష్టి కలిగిన నాయకత్వం, కళాత్మక ప్రతిభ, తెలుగు ప్రజల పట్ల నిబద్ధత ఆంధ్ర ప్రదేశ్‌పై చెరిగిపోని ముద్ర వేశారని తెలిపింది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతిని ‘రాష్ట్ర స్థాయి వేడుకగా’ జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశిస్తూ ఏపీ సీఎస్ విజయానంద్ జీవో జారీ చేశారు.


ఎన్టీ రామారావు తెలుగు ప్రజలకే గర్వకారణమని ఉత్తర్వుల్లో వెల్లడించింది. సినిమా, రాజకీయాల ద్వారానే కాకుండా తెలుగు ప్రజలకు ఆయన సేవలు చాలా రంగాల్లో విస్తరించాయి. నటన ద్వారా ఎన్టీఆర్ తెలుగు భాష, జానపద సంప్రదాయాలను పునరుజ్జీవింపజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, సామాజిక న్యాయం, పరిపాలన వికేంద్రీకరణ, ప్రజాకేంద్రిత పాలన సంస్కరణలను ప్రవేశపెట్టారు. గ్రామీణ పేదల ఆత్మగౌరవానికి ఎంతో విలువను తెచ్చారు. తెలుగు వారికి జాతీయస్థాయిలో గుర్తింపును ఇచ్చి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటారు. ఇకపై ప్రతి సంవత్సరం ఆయన జయంతిని గౌరవపూర్వకంగా రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖలు, శాఖాధిపతులు, కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు అందరూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 27 , 2025 | 09:34 PM