ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Government: ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN, Publish Date - Jun 01 , 2025 | 08:06 PM

ఏపీ ఉద్యోగుల బదిలీలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు జూన్ 9వ తేదీ వరకు పొడిగించింది.ఉద్యోగుల బదిలీలపై మే15వ తేదీన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది.

AP Employees Transfers

అమరావతి: ఏపీ ఉద్యోగుల బదిలీలపై (AP Employees Transfers) కూటమి ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు జూన్ 9వ తేదీ వరకు పొడిగించింది. ఉద్యోగుల బదిలీలపై మే15వ తేదీన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. మే 16వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఆయా శాఖల బదిలీల్లో అర్హతలపై ఇప్పటికే మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. మరో ఏడు రోజుల పాటు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. బదిలీల గడువును పెంచాలని ప్రభుత్వానికి ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు విన్నవించారు.


బదిలీలకు సంబంధించిన నిబంధనలివే..

  • ఒకే చోట ఐదేళ్లు పూర్తి అయిన ఏపీ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశించింది.

  • పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారిని బదిలీ చేయనుంది.

  • ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

  • వచ్చే ఏడాది మే 31వ తేదీలోపు రిటైర్‌మెంట్ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది.

  • అంధులైన ఉద్యోగులకు బదిలీల్లో ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది.

  • మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రులకు వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యం ఇచ్చింది.

  • ట్రైబల్ ఏరియాలో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం కల్పించింది.

  • మెడికల్ గ్రౌండ్‌లో భాగంగా ఉద్యోగుల వినతి మేరకు బదిలీ చేయనుంది.

  • వితంతు ఉద్యోగుల వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యం ఇచ్చింది.

  • స్పౌజ్ ఉద్యోగులకు బదిలీల్లో ఒకే చోట లేదా దగ్గరి ప్రాంతాల్లో బదిలీ చేసేలా ప్రాధాన్యం కల్పించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పండుగలా ప్రారంభమైన రేషన్ సరుకుల పంపిణీ

ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తోంది..

For More AP News and Telugu News

Updated Date - Jun 01 , 2025 | 08:15 PM