AP Politics: బీజేపీలో చేరిన జకియా ఖానమ్..
ABN, Publish Date - May 14 , 2025 | 12:17 PM
వైసీపీకి రాజీనామా చేసిన శాసన మండలి వైస్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన జకియా ఖానమ్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పురంధేశ్వరి.. కీలక కామెంట్స్ చేశారు.
విజయవాడ, మే 14: వైసీపీకి రాజీనామా చేసిన శాసన మండలి వైస్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన జకియా ఖానమ్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పురంధేశ్వరి.. కీలక కామెంట్స్ చేశారు. బీజేపీ నినాదం సబ్ కే సాత్.. సబ్ కా వికాస్ అని.. పార్టీలో కుల మతాలకు తావు లేదని స్పష్టం చేశారు. ఇది బీజేపీ మూల సిద్ధాంతం అని పేర్కొన్నారామె. శాసన మండలి వైస్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసి జకియా ఖానమ్ బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు పురంధేశ్వరి. మైనార్టీలకు బీజేపీపై ఉన్న ప్రేమ, విశ్వాసం జకియా ఖానమ్ చేరికతో మరోసారి రుజువైందన్నారు.
మైనార్టీలకు బీజేపీలో మంచి స్థానం ఉంటుందని.. జకియా ఖానమ్ కుటుంబం ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటుందన్నారు. జకియా ఖానమ్‌ను మనస్ఫూర్తిగా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. కులమతాలకు అతీతంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే బీజేపీ లక్ష్యం అన్న పురంధేశ్వరి.. ఆ దిశగానే దేశానికి బీజేపీ సుపరిపాలన అందిస్తోందని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగితే భారత్ గట్టిగానే బుద్ధి చెప్పిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దృఢమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. 2014 ముందు కళ్ళు మూసుకునే పరిస్థితి ఉండేదని.. 2014 తరువాత పరిస్థితులు మారాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలతో ప్రత్యర్థులు హడలిపోయారని చెప్పారామె.
ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసిన భారత్ సైన్యం సామర్థ్యం అద్భుతం అని పురంధేశ్వరి కొనియాడారు. మన యుద్ధం ఉగ్రవాదులపై అనే సందేశం ప్రధాని ప్రపంచానికి తెలియజేశారన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు తర్ఫీదు ఇస్తుందని.. అందుకే మన యుద్ధం పాకిస్తాన్ పౌరులమీద కాకుండా.. ఉగ్రవాదులపై యుద్ధం చేశామన్నారు. బలమైన నాయకత్వం, సత్తా ఉన్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని ప్రశంసించారామె. అటువంటి నాయకత్వాన్ని ప్రధాని మోదీ రూపంలో బీజేపీ ఈరోజు దేశానికి అందించిందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.
Also Read:
రూ.810 కోట్ల సెటిల్‌మెంట్‌కు ఆపిల్ నిర్ణయం.. ఇలా క్లెయిమ్
పేరుకేమో బ్యూటీపార్లర్.. కానీ లోపల నడిచేది మాత్రం..
ఈ లక్షణాలు ఉంటే స్త్రీలు పిచ్చిగా ప్రేమిస్తారు..
For More Andhra Pradesh News and Telugu News
Updated Date - May 14 , 2025 | 12:23 PM