ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Students: మాస్టారూ.. మీరు వెళ్లొద్దు

ABN, Publish Date - Jun 30 , 2025 | 04:31 AM

ఉద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైంది.! ఎందుకంటే దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను తీర్చిదిద్దేవి వారే!! విధి నిర్వహణలో భాగంగా టీచర్లు పలు పాఠశాలల్లో పనిచేస్తారు. వారి ఉద్యోగ కాలంలో బదిలీలపై బడులు మారుతూ ఉంటారు.

ద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైంది.! ఎందుకంటే దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను తీర్చిదిద్దేవి వారే!! విధి నిర్వహణలో భాగంగా టీచర్లు పలు పాఠశాలల్లో పనిచేస్తారు. వారి ఉద్యోగ కాలంలో బదిలీలపై బడులు మారుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఉపాధ్యాయులు పిల్లలకు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా.. వారితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. బదిలీపై టీచర్లు వేరే చోటుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తట్టుకోలేని విద్యార్థులు.. ‘మాస్టారూ.. మీరు స్కూల్‌ వదిలి వెళ్లొద్దు’ అంటూ అడ్డుకొని, కంటతడి పెట్టుకున్న పలు సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఘటనే తాజాగా అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం కందిపూడి ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. బదిలీ అయిన ఉపాధ్యాయుడు పి.రమణ రిలీవ్‌ కావడానికి ఆదివారం పాఠశాలకు వచ్చారు. ఈ విషయం తెలిసి విద్యార్థులు అతని వద్దకు చేరుకున్నారు. తాను బదిలీపై వెళుతున్నట్టు ఆయన చెప్పడంతో.. వెళ్లవద్దంటూ విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. బోరున విలపిస్తూ ఆయన బైక్‌ను అడ్డుకున్నారు. చాలాసేపటి తర్వాత తల్లిదండ్రులు వారికి నచ్చజెప్పి ఇళ్లకు తీసుకువెళ్లారు.

- బుచ్చెయ్యపేట(అనకాపల్లి జిల్లా)- ఆంధ్ర జ్యోతి

Updated Date - Jun 30 , 2025 | 04:41 AM