Jana Sena MP Uday Srinivas: లోక్‌సభలో హిందూ ఆలయాల నిధులపై చర్చించిన జనసేన ఎంపీ
ABN, Publish Date - Mar 17 , 2025 | 06:35 PM
MP Uday Srinivas: హిందూ ఆలయాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయని కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చర్చించారు. హిందూ ఆలయాలకు వచ్చే నిధులు ఎలా ఖర్చుపెడుతున్నారనే విషయాలను ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు.
ఢిల్లీ: హిందూ ఆలయాలపై ప్రభుత్వాల నియంత్రణ గురించి లోక్‌సభలో కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చర్చించారు. హిందూ ఆలయాలు రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో, ఇతర మతాల ప్రార్థనా స్థలాలు స్వతంత్రంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న హిందూ ఆలయాల నుంచి వచ్చిన ఆదాయం ఎంత అని నిలదీశారు. ఆలయాల నుంచి వచ్చిన నిధులను ఇతర అవసరాల కోసం ఖర్చు చేశారా అని అడిగారు. ఆలయాలకు స్వతంత్రత కోరుతూ మత సంస్థల నుంచి డిమాండ్లు ఏమైనా వచ్చాయా అని ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఆలయాల పరిరక్షణపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏమన్నారంటే..
దేశవ్యాప్తంగా ఆలయాలతో సహా 3,698 చారిత్రక కట్టడాలు, పురాతన నిర్మాణాలను జాతీయ ప్రాముఖ్యత కలిగిన వాటిగా వర్గీకరించామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఆర్కియాలాజికల్ సైట్స్ అండ్ రిమెయిన్స్ యాక్ట్ 1958 ప్రకారం వాటిని పరిరక్షిస్తున్నామని చెప్పారు. వాటిలో ఆలయాలతో సహా 143 చారిత్రక ప్రదేశాల్లో టికెట్ల ద్వారా ఆర్కియాలిజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆదాయాన్ని గడిస్తోందని అన్నారు. వాటి ద్వారా 2023-24లో రూ. 317.92 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ నిధులను భారత పురావస్తు శాఖ (ASI) పురాతన కట్టడాల పరిరక్షణకు తప్ప దారి మళ్లించదని స్పష్టం చేశారు. ASI పరిధిలో ఉన్న ఆలయాలకు స్వతంత్రత కల్పించాలని డిమాండ్ ఏదీ తమ దృష్టికి రాలేదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
TTD decision: వారికి గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ.. ఇకపై
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
Cooperative banks corruption: సహకార బ్యాంకుల్లో అవినీతిపై అచ్చెన్న సమాధానం ఇదీ..
Read Latest AP News And Telugu News
Updated Date - Mar 17 , 2025 | 06:41 PM