AP News: కాకినాడ జిల్లాలో విషాదం.. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి
ABN, Publish Date - Jun 14 , 2025 | 10:43 AM
తాళ్లరేవు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతిచెందిన ఘటనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వారు వైద్యుల నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కాకినాడ జిల్లా: వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతిచెందింది. ఈ సంఘటన కాకినాడ జిల్లాలోని (Kakinada District) తాళ్లరేవు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. పెద్ద బొడ్డు వెంకటయ్య పాలెంకు చెందిన చెక్క మాధురి, రాము దంపతులు రెండో డెలివరీ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. రాత్రి సాధారణ డెలివరీ అవ్వడంతో అక్కడ ఉన్న స్వీపర్ బిడ్డను తీసుకుంది. అయితే బిడ్డలో చలనం లేదంటూ తక్షణమే మీరు కాకినాడ తీసుకెళ్లాలని చెప్పారు.
హుటాహుటినా కాకినాడ తరలించినప్పటికీ అప్పటికే బిడ్డ మృతి చెందినట్లు కాకినాడ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఉదయం నాలుగు గంటలకు తాళ్లరేవు ఆస్పత్రికి వచ్చినా సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులు ఎవరు తమను పట్టించుకోలేదంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బంధువులు ఆందోళన చేపట్టారు.
నిర్లక్ష్యానికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని బిడ్డ తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆస్పత్రిపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి
విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ..
తల్లుల ఖాతాల్లోకి నిధులు.. ఆనందంలో కుటుంబాలు
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 14 , 2025 | 10:43 AM