CM ChandraBabu: గుడ్ ఫ్రైడే వేళ.. పాస్టర్లకు గుడ్ న్యూస్
ABN, Publish Date - Apr 17 , 2025 | 08:26 PM
CM ChandraBabu: మరికొన్ని గంటల్లో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే జరుపుకోనున్నారు. అలాంటి వేళ.. పాస్టర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. వారికి ప్రతి నెల రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 8 మందికిపైగా పాస్టర్లకు లబ్ది చేకూరనుంది.
అమరావతి, ఏప్రిల్ 17: మరికొన్ని గంటల్లో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్దలతో జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో పాస్టర్లకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నిర్ణయించారు.
దీంతో 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2024, మే నుంచి నవంబర్ వరకు ఈ గౌరవ వేతనం విడుదల చేయనున్నారు. ఈ ఏడు నెలల కాలానికిగాను రూ. 30 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడు నెలలకు ఒకొక్క పాస్టర్‌కు రూ. 35, 000 చొప్పున లబ్ది చేకూరనుంది.
2023 జనవరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వస్తే.. గౌరవ వేతనం అందిస్తామని పాస్టర్లకు ఆయన హామీ ఇచ్చారు. ఆ క్రమంలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీని అమలు చేసింది.
2024 మే, జూన్ మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి బరిలో నిలిచాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకొంటు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే కూటమి ప్రభుత్వం పలు హామీలను అమలు చేసింది. మరికొన్ని హామీలు అమలు చేయాల్సి ఉంది. మరోవైపు.. గత జగన్ ప్రభుత్వం సంక్షేమం పేరుతో పలు పథకాల రూపంలో ప్రజలకు లబ్ది చేకూర్చింది. దీంతో ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. దీంతో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు.. అమల్లో కొంత ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు పథకాలను సీఎం చంద్రబాబు ప్రారంభించి అమలు చేస్తూ వస్తున్న విషయం విధితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News
Updated Date - Apr 18 , 2025 | 02:23 PM