Share News

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

ABN , Publish Date - Apr 17 , 2025 | 06:57 PM

AP High Court: వైసీపీ కార్యకర్త బోరుగడ్డ అనిల్‌కు ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అతడి తల్లికి అనారోగ్యం కారణంగా బెయిల్ పొడిగించుకొనే క్రమంలో నకిలీ పత్రలు సమర్పించినట్లు కోర్టు భావించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యహారంపై నివేదిక ఇవ్వాలని జిల్లా జడ్జిని కోరింది. అంతేకాదు.. ఈ కేసును మరో రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్
Borugadda Anil

అమరావతి, ఏప్రిల్ 17: నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన వైసీపీ కార్యకర్త, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అతడి తల్లి అనారోగ్యంతో ఉన్నట్లు ఇచ్చిన సర్టిఫికేట్‌పై రాత, సంతకం తనది కాదని లలితా సూపర్ స్పెషాల్టీ హాస్పటల్ వైద్యులు డాక్టర్ పివి రాఘవ శర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పోలీసులకు వైద్యుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను బోరుగడ్డ అనిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ నేపథ్యంలో డాక్టర్ రాఘవశర్మ వాంగ్మూలాన్ని ఓ జ్యుడిషీయల్ ఫస్ట్ క్లస్ మేజిస్ట్రేట్‌తో రికార్డు చేయించి తమకు పంపాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని ఏపీ హైకోర్టు గురువారం ఆదేశించింది. అయితే ఇప్పటికే రికార్డు చేసి కోర్టు ముందుకు తెచ్చిన వైద్యుడి వాంగ్మూలం రికార్డును గుంటూరు జిల్లా ప్రదాన న్యాయమూర్తికి పంపాలని రిజిస్ట్రీని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.


ఇక పిటిషనర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ నిర్ణయాన్ని వెల్లడించాలని బోరుగడ్డ అనిల్ తరుపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్దనను హైకోర్టు నిర్దంద్వంగా తొసిపుచ్చింది. ఈ నకిలీ సర్టిఫికేట్ వ్యవహారంలో నిజానిజాలు తేలిన తర్వాతే బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపడతామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ క్రమంలో ఈ కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.


ఇక బోరుగడ్డ అనిల్.. తన తల్లి గుండె సంబందిత వ్యాధితో బాధపడుతూ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ గతంలో హైకోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో బెయిల్ కోసం నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నట్లు బోరుగడ్డ అనిల్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో తాను ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని లలితా సూపర్ స్పెషాల్టీ హస్పటల్ వైద్యులు డాక్టర్ పివి రాఘవశర్మ వెల్లడించారు. ఇక బోరుగడ్డ అనిల్‌పై కోర్టు దిక్కార చర్యలు ప్రారంభించాలంటూ అనుబంధ పిటిషన్‌ను ఏపీ హైకోర్టులో పోలీసులు తాజాగా దాఖలు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Updated Date - Apr 17 , 2025 | 06:57 PM