Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:57 PM
Gold: తనిఖీల్లో భాగంగా కారులో భారీగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా కారు డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తరలిస్తున్న బంగారం 18 కేజీలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీని విలువ ప్రస్తుతం రూ. 15 కోట్లకు పైగా ఉందని చెప్పారు.
కడప, ఏప్రిల్ 17: ఉమ్మడి కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో భారీగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ప్రొద్దుటూరులోని రామేశ్వరం బైపాస్ రోడ్డులో పోలీసులు.. వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో పలు సూట్ కేసుల్లో భారీగా బంగారాన్ని తరలిస్తున్నట్లు వారు గుర్తించారు. ఆ క్రమంలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారుతో పాటు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వారిని పోలీసులు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కారులో బంగారాన్ని లెక్కించగా.. 18 కేజీల ఉన్నట్లు లెక్క తేలింది. దీని విలువ రూ. 15 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ బంగారం హైదరాబాద్‌లోని ఓ నగల దుకాణానికి చెందినదని వారు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ బంగారానికి సంబంధించిన రసీదుల గురించి వారు ఆరా తీస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియ జేశారు. ఈ నేపథ్యంలో బంగారం నగల దుకాణం వారితో పోలీసులు మాట్లాడుతూన్నారు. బిల్లు ఉన్నాయా? లేదా అంటూ బంగారం దుకాణం యజమానులను ప్రశ్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News