K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:34 PM
K Ram Mohan Naidu: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడును సీఎం చంద్రబాబు అభినందించారు. యంగ్ గ్లోబల్ లీడర్‌గా రామ్మెహన్ నాయుడును దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక సదస్సు ఎంపిక చేయడం పట్ల ఆయన హర్షం వక్తం చేశారు. ఈ పురస్కారానికి ఆయన ఎంపిక కావడం.. తెలుగు జాతికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
అమరావతి, ఏప్రిల్ 17: దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా ఈ ఏడాది యంగ్ గ్లోబల్ లీడర్‌గా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మెహన్ నాయుడు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. గురువారం తన ఎక్స్ ఖాతా వేదికగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయడుకు సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు మన దేశానికి.. మరి ముఖ్యంగా మన తెలుగు జాతికి గర్వ కారణమని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సేవను అంకిత భావంతో చేస్తున్నారంటూ రామ్మోహన్ నాయుడుపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఇది దేశంలోని యూవతకు స్ఫూర్తినిస్తుందన్నారు. మన రాష్ట్రంతోపాటు దేశ పురోగతికి కృషి చేస్తూ.. ప్రపంచ వేదికపై భారత్ స్వరాన్ని వినిపిస్తూ.. ఆయన నిరంతరం విజయాలను సాధించాలని కోరుకొంటున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఈ ఏడాది జనవరిలో యూరప్‌లోని దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ తదితరులు హాజరయ్యారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పలువురు కేంద్రమంత్రులు సైతం వెళ్లారు. వారిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అయితే ఈ ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి.
ఇవి కూడా చదవండి
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఆ ఒక్క విటమిన్ లోపం.. మీ వైవాహిక జీవితం నాశనం.. చేస్తుంది..
మనిషి కాదు మృగం.. 11 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా..ౌ
For AndhraPradesh News And Telugu News