ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhuvaneswari: ప్రజల ఆశీర్వాదంతో జరిగిన ఈ శుభకార్యం ఎప్పటికీ గుర్తుంటుంది..

ABN, Publish Date - May 25 , 2025 | 10:56 AM

Bhuvaneswari: కుప్పంలో గృహప్రవేశ కార్యక్రమం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి, ఆమె కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తమ సంతోషాన్ని పంచుకున్నారు.

Nara Bhuvaneswarai, Minister Lokesh

చిత్తూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సొంతింటి గృహప్రవేశం కుప్పంలో (Housewarming) పండువలా జరిగింది. సీఎం చంద్రబాబు ఎప్పట్నుంచో అనుకుంటున్న సొంతింటి కల ఈరోజు నెరవేరింది. ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకే గృహప్రవేశ పూజా కార్యక్రమాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి (Bhuvaneswari), ఆమె తనయుడు మంత్రి లోకేశ్ (Minister Lokesh) సోషల్ మీడియా (Social Media) వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.


ఎంతో సంతృప్తినిచ్చింది: నారా భువనేశ్వరి..

‘‘కుప్పంలో సొంతింటి గృహప్రవేశ కార్యక్రమం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా ఉంటూ... మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు ఆత్మబంధువులైన కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరిగింది. కల్మషం లేని మంచి మనుషుల మధ్య... మా కుటుంబ సభ్యులుగా భావించే ప్రజల ఆశీర్వాదంతో జరిగిన కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చింది. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ శుభకార్యం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కుప్పం నియోజకవర్గ ప్రజల దీవెనలకు, ఆత్మీయతకు, అభిమానానికి, మద్దతుకు శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నా. కుప్పం మా ఇల్లు, కుప్పం ప్రజలే మా కుటుంబం. ఇది హృదయపూర్వక వేడుక, 36 సంవత్సరాలుగా మాకు మద్దతుగా నిలిచి, ప్రతి అడుగులో మమ్మల్ని నడిపిస్తున్న కుప్పం ప్రజల ఆశీర్వాదం. వారి ప్రేమ, ఆశీర్వాదాలు, ప్రశంసలకు నేను చాలా కృతజ్ఞురాలను’’ అంటూ భువనేశ్వరి ట్వీట్ చేశారు.

Also Read: సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం


ఇది మనందరి పండుగ.. మంత్రి లోకేష్..

‘‘36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా నిలుస్తూ, ప్రతి అడుగులో తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో నేడు మా సొంతింటి గృహప్రవేశం జరిగింది. మీరు చూపించే ప్రేమ, ఆత్మీయత మరువలేని అనుభూతిగా మిగిలిపోతుంది. ఇది మా కుటుంబ పండుగ కాదు, మనందరి పండుగ. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు దీవెనగా నిలుస్తాయి. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పండుగలా సీఎం చంద్రబాబు గృహప్రవేశం

శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

For More AP News and Telugu News

Updated Date - May 25 , 2025 | 12:27 PM