Chandrababu: మోదీజీ హమ్ ఆప్‌కే సాత్‌హై
ABN, Publish Date - May 03 , 2025 | 04:44 AM
పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఐదు కోట్ల ఆంధ్రులు, దేశం మొత్తం మీ వెంట ఉందంటూ హిందీలో వ్యాఖ్యానించారు
అమరావతి సభలో పహల్గాం ఉగ్రదాడి ఘటనను సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఈసమయంలో తామంతా ప్రధాని మోదీ వెంట ఉంటామంటూ హిందీలో చంద్రబాబు తన మద్దతు ప్రకటించారు. ‘మోదీజీ హమ్ ఆప్‌కే సాత్‌హై. ఆంధ్రప్రదేశ్ కే పాంచ్ కరోడ్ లోగ్ ఆప్‌కే సాత్ హై. పూరా దేశ్ ఆప్‌కే సాత్ హై.’’ (మోదీగారు! మీ వెంట మేముంటాం. ఏపీకి చెందిన ఐదు కోట్ల మంది ప్రజలు మీతోనే ఉంటారు. దేశమంతా మీ వెంట ఉంటుంది) అంటూ స్పష్టం చేశారు. అనంతరం సభికులతో వందేమాతరం....భారత్‌మాతా కీ జై అంటూ చంద్రబాబు నినాదాలు చేయించారు. ప్రధాని మోదీ సైతం...చెయ్యెత్తి వందేమాతరం..భారత్ మాతాకీ జై అంటూ నినదించారు.
ఇవి కూడా చదవండి
Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు
Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Updated Date - May 03 , 2025 | 04:44 AM