Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ABN , First Publish Date - 2025-05-02T16:40:06+05:30 IST

దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి కనకదుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Pawan Kalyan

Amaravati - Pawan Kalyan: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోదీకి రాష్ట్ర ప్రజల తరపున నమస్కారాలు తెలియచేశారు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రస్తుతం దేశంలో కీలక పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఎంతో బిజీ షెడ్యూల్ మధ్య కూడా ప్రధాని అమరావతికి రావడం చాలా సంతోషకరమని పవన్ అన్నారు. ప్రధాని మోదీకి ఆ కనకదుర్గమ్మ మంచి ఆరోగ్యం, మరిన్ని విజయాలు ప్రసాదించాలని పవన్ దేవతామూర్తిని ప్రార్థించారు.

అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ధర్మ యుద్ధంలో విజయం సాధించారని పవన్ చెప్పారు. అమరావతి పనులు పు:న ప్రారంభమవుతున్న శుభసందర్భంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు పవన్ ధన్యవాదాలు తెలియచేశారు. గత ఐదేళ్లలో పడిన గాయాలు మనందరికీ గుర్తున్నాయి. ఎన్నో అవమానాలు, గాయాలు అమరావతి రైతులు అనుభవించారని పవన్ అన్నారు.

"గత ఐదేళ్లు అమరావతి రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. అమరావతి రైతులు మరిచిపోలేని పోరాటం చేశారు. అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుందని ఆనాడు మాట ఇచ్చాం. ఇచ్చిన మాటకు కట్టుబడి మళ్లీ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం చేసుకుంటున్నాం. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్‌ను తుడిచిపెట్టేసింది. అయితే, ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారు" అని పవన్ అన్నారు.

అమరావతి రైతుల త్యాగాలు మరిచిపోలేనివని చెప్పిన పవన్.. ఉద్యమంలో అమరావతి మహిళా రైతుల పాత్ర కీలకమన్నారు. అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని చెప్పిన పవన్... రాజధాని రైతుల త్యాగాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. అమరావతి ప్రపంచస్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుందని పవన్‌ ఆకాంక్షించారు. రాజధాని రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదు.. రాష్ట్రానికి ఒక భవిష్యత్‌ ఇచ్చారని పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు.

రాళ్లు, రప్పల్లో మహానగరాన్ని చూసిన వ్యక్తి చంద్రబాబు అని పవన్‌ చెప్పారు. సైబరాబాద్‌ను చంద్రబాబు ఎలా సృష్టించారో.. అమరావతిని కూడా అలాగే అభివృద్ధి చేస్తారని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఉగ్రదాడి అనంతరం క్లిష్ట పరిస్థితుల్లో కూడా.. ప్రధాని మోదీ మన కోసం అమరావతికి వచ్చారని పవన్‌ గుర్తు చేశారు. ఏపీపై మోదీ నిబద్ధతకు ఇదే నిదర్శనమని పవన్‌ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట

ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాక్ భారీ భద్రత

For More AP News and Telugu News

Updated Date - 2025-05-02T16:48:50+05:30 IST