Capital Amaravati: అమరావతి భూ కేటాయింపులపై సంచలన నిర్ణయం
ABN, Publish Date - Jul 13 , 2025 | 06:27 PM
రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు, గతంలో చేసిన మరికొన్ని సంస్థల కేటాయింపులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, జులై 13: రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు, గతంలో చేసిన మరికొన్ని సంస్థల కేటాయింపులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (GoM) సిఫార్సుల మేరకు పలు సంస్థలకు ప్రభుత్వం భూ కేటాయింపులు చేసింది. గతంలో భూములు కేటాయించిన ఆరు సంస్థలకు పలు సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాజధానిలో కొత్తగా ఏడు సంస్థలకు 32. 40 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ఆ క్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి 2 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. 60 ఏళ్ల లీజు ప్రాతిపదికన పలు సంస్థలకు ఈ భూములు కేటాయించింది. ఇక గెయిల్‌కు 0.40, అంబికాకు ఎకరా భూమి కేటాయింపులను రద్దు చేసింది. అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే వివిధ సంస్థలకు ఏపీసీఆర్డీఏ భూములు కేటాయింపుపై 18వ మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయాలకు పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 122 జారీని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ జారీ చేశారు.
జూన్ 23వ తేదీన జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం భూములు కేటాయింపు.. పున: పరిశీలన, కొత్తగా కేటాయింపు చేస్తూ పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రతిపాదనలను జులై 5వ తేదీన జరిగిన 50 సీఆర్డీఏ అథారిటీ ముందు కమిషనర్ ఉంచారు. దీంతో సదరు ప్రతిపాదనలు ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..
కోనసీమ ప్రజలకు గుడ్ న్యూస్: అమలాపురం ఎంపీ
తెలంగాణలో కవితను తిరగనీయం: తీన్మార్ మల్లన్న
Read Latest AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 13 , 2025 | 07:14 PM