Share News

Ganti Harish Madhur: కోనసీమ ప్రజలకు గుడ్ న్యూస్: అమలాపురం ఎంపీ

ABN , Publish Date - Jul 13 , 2025 | 05:28 PM

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ గంటి హరీశ్ మాథుర్ తెలిపారు. ఇందుకు కృషి చేసిన మంత్రి లోకేష్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Ganti Harish Madhur: కోనసీమ ప్రజలకు గుడ్ న్యూస్: అమలాపురం ఎంపీ
Amalapuram MP Ganti Harish Madhur

ముమ్మిడివరం, జులై 13: కోనసీమ ప్రాంత ప్రజలకు అమలాపురం లోక్‌సభ సభ్యుడు, టీడీపీ నేత గంటి హరీశ్ మాథుర్ గుడ్ న్యూస్ చెప్పారు. కోనసీమకు కేంద్రీయ విద్యాలయం మంజూరు అయ్యిందని ఆయన వెల్లడించారు. ఆదివారం ముమ్మిడివరంలో స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో కలిసి ఎంపీ గంటి హరీశ్ మాథుర్ విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లవరం మండలం ఓడల రేవు గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


అందుకోసం ఏడు ఎకరాల స్థల సేకరణ చేపట్టామన్నారు. ఈ మేరకు రూ.3.5 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. అయితే ఈ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సహకరించారని వివరించారు ఎంపీ. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు ఎంపీతోపాటు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.


అలాగే కోనసీమ ప్రాంత విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి మరిన్ని విద్యాసంస్థలు తీసుకు వచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీశ్ మాథూర్ స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా.. ప్రజారంజకంగా పాలన చెయ్యలేక పోయిందని విమర్శించారు. అంతేకాదు.. ప్రస్తుతం సరైన ప్రతిపక్ష పార్టీగా కూడా వ్యవహరించడంలో సైతం ఆ పార్టీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తద్వారా ప్రజలకు వైసీపీ మరింత దూరమవుతుందని ఎంపీ హరీష్ మాథుర్ వెల్లడించారు.


మరోవైపు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా గతేడాది డిసెంబర్‌లో కేంద్ర కేబినెట్‌.. ఆంధ్రప్రదేశ్‌లో 8 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి ద్వారా దాదాపు 8 వేల మంది విద్యార్దులకు లబ్ది చేకూరనుందన్న విషయం విదితమే. తాజాగా మరో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు.. అది కూడా కోనసీమ ప్రాంతంలో ఏర్పాటు కానుండడంతో.. అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

మండలి చైర్మన్ గుత్తా కు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు

తెలంగాణలో కవితను తిరగనీయం: తీన్మార్ మల్లన్న


Read Latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 13 , 2025 | 06:03 PM