ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట

ABN, Publish Date - May 02 , 2025 | 08:27 AM

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.

Kethireddy Peddareddy

అనంతపురం జిల్లా: తాడిపత్రి (Tadipatri) మాజీ ఎమ్మెల్యే (Ex MLA) కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Peddareddy)కి హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. తాడిపత్రి వెళ్ళేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులు తనను తాడిపత్రిలోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని... జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం తాడిపత్రి వెళ్ళేందుకు కేతిరెడ్డికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

Also Read:

ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాక్ భారీ భద్రత


తాడిపత్రికి పదుల సంఖ్యలో వాహనాలతో ర్యాలీగా వెళ్ళొద్దని... కేవలం ఐదు వాహనాల్లో మాత్రమే తాడిపత్రి కి వెళ్ళాలని హైకోర్టు పెద్దారెడ్డికి ఆదేశించింది. అలాగే తాడిపత్రికి వెళ్ళేందుకు కేతిరెడ్డికి తగిన భద్రత కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి జిల్లా ఎస్పీ జగదీష్‌ను కలిసి ఒకటి, రెండు రోజుల్లో తాడిపత్రి వెళ్ళేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా హైకోర్టు తీర్పుతో తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.


కాగా తాడిపత్రిలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రావొద్దంటూ పోలీసులు నిబంధనలు పెట్టారు. ఆయన తాడిపత్రిలో ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ యల్లనూరు మండలం, తిమ్మంపల్లిలో కేతిరెడ్డిని గృహనిర్బంధం చేస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల ఆంక్షలపై కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. తాడిపత్రికి వెళ్లవచ్చునంటూ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన తాడిపత్రికి పెద్దారెడ్డి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి

ఆపరేషన్‌ కగార్‌ను కొనసాగించాలి

For More AP News and Telugu News

Updated Date - May 02 , 2025 | 08:27 AM