ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TDP: టీడీపీలో విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

ABN, Publish Date - May 06 , 2025 | 07:16 AM

Palakondrayudu: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు మంగళవారం కన్నుమూశారు.బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయనకు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Palakondrayudu

అన్నమయ్య జిల్లా: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో(Telugu Desam Party) తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు (Palakondrayudu) ఇవాళ(మంగళవారం) తెల్లవారు జామున అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో పాలకొండ్రాయుడుని కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాలకొండ్రాయుడు ఈరోజు(మే6)వ తేదీన మృతి చెందారు. పాలకొండ్రాయుడు కుటుంబం నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.


ఆయన మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. పాలకొండ్రాయుడు మృతిపట్ల టీడీపీ అగ్రనేతలు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఆయనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పాలకొండ్రాయుడు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో పాలకొండ్రాయుడు కుటుంబ సభ్యులకు టీడీపీ నేతలు ధైర్యం చెబుతున్నారు. ఆయన టీడీపీకి అందించిన సేవలను ఆ పార్టీ నేతలు గుర్తుతెచ్చుకుంటున్నారు.


పాలకొండ్రాయుడు రాజకీయ నేపథ్యమిదే..

పాలకొండ్రాయుడు 1978 ఎన్నికల్లో రాయచోటి నుంచి జనతా పార్టీ తరపున తొలిసారిగా పోటీచేశారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి గెలిచారు. 1984 ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 1999, 2004 ఎన్నికల్లో రాయచోటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు.


పాలకొండ్రాయుడు మృతి పార్టీకి తీరని లోటు: నారా లోకేష్

మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు మృతి పట్ల విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. పాలకొండ్రాయుడు కుటుంబం నాలుగు దశాబ్దాలుగా పార్టీకి విశేష సేవలు అందిస్తున్నారని చెప్పారు. రాజంపేట ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పాలకొండ్రాయుడు ప్రజల అభ్యున్నతికి విశేష కృషిచేశారని అన్నారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని చెప్పారు. కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


మంత్రుల సంతాపం

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు మృతదేహాన్ని సందర్శించి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డిలు సంతాపం తెలిపారు. నాలుగు సార్లు రాయచోటి ఎమ్మెల్యేగా ఒకసారి రాజంపేట ఎంపీగా గెలిచిన పాలకొండ్రాయుడుది స్థానిక ప్రజలతో విడదీయలేని బంధమని మంత్రులు గుర్తుచేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Deputy CM Pawan: బంగాళాఖాతంలో ఘర్షణలు

CM Chandrababu: అన్ని సేవలూ వాట్సాప్‌లోనే

Minister Gottipati Ravi Kumar: విద్యుత్‌ ఒప్పందాలపై అసత్య ప్రచారం

For More AP News and Telugu News

Updated Date - May 06 , 2025 | 09:37 AM