Bird Flu : తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ అలజడి.. ఇక్కడ 62వేల కోళ్లు మృతి..
ABN, Publish Date - Feb 11 , 2025 | 01:50 PM
Bird Flu : ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే ఏకంగా 62 వేల కోళ్లు మరణించడంతో రెడ్ అలర్డ్ ప్రకటించారు.
ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొద్ది వారాలుగా ఆకస్మికంగా లక్షల సంఖ్యలో మృతి చెందాయి. ఒక్క గోదావరి జిల్లాలోనే 62 వేల కోళ్లు చనిపోయాయి. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ జిల్లాల్లోని కానూరు అగ్రహారం, వేల్పూరు ఫారాల నుంచి నమూనాలు సేకరించి పరిశీలించగా బర్డ్‌ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కోళ్ల ఫారాలకు కిలోమీటర్ దూరం వరకూ రెడ్ అలర్ట్. కొల్లేరుకు వచ్చిన వలస పక్షులు వైరస్ వ్యాప్తి చేసే అవకాశం ఉందని చెప్పడం అంతటా కలకలం రేపుతోంది.
Updated Date - Feb 11 , 2025 | 01:56 PM