Prime Minister Narendra Modi: నూతన జంటకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ
ABN, Publish Date - Jun 12 , 2025 | 12:35 PM
వరంగల్‌కు చెందిన కొత్త జంటకు ప్రధాని నరేంద్ర మోదీ మర్చిపోలేని గిఫ్ట్ పంపించారు. దీంతో వధూవరుల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సామాన్య ప్రజల పట్ల ప్రధాని మోదీ చూపిన ప్రత్యేక శ్రద్ధపై జిల్లా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దేశానికి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లుగా.. ఎంతో బిజీగా ఉండే భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సామాన్యుల పట్ల కూడా అంతే బాధ్యతగా ఉంటారు. తాజాగా చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం. మహబూబాద్ జిల్లా బయ్యారానికి చెందిన శివకుమార్, లలిత వివాహం మే 23న జరిగింది. అయితే తన వివాహానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తూ పీఎం కార్యాలయానికి.. శివకుమార్ శుభ లేఖ పంపారు. అక్కడి నుంచి బదులు వస్తుందని అతను ఊహించలేదు. కానీ వారి ఆలోచనలకు భిన్నంగా శివకుమార్ పెళ్లికి.. మోదీ నుంచి అరుదైన కానుక వచ్చింది.
Updated Date - Jun 12 , 2025 | 12:35 PM