ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎర్నాకుళం రైలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?

ABN, Publish Date - Dec 29 , 2025 | 12:26 PM

బీ 1, ఎమ్‌ 2 కంపార్ట్మెంట్లలో అగ్నిప్రమాదం జరిగినట్లు గుర్తించామనిఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. నర్సింగబల్లి వద్ద B1 ఏసీ బోగికి బ్రేక్‌లు పట్టేయడంతో మంటలు చెలరేగాయని అన్నారు.

అనకాపల్లి, డిసెంబర్ 29: టాటా నగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ప్రమాద వివరాలను మీడియాకు తెలియజేశారు. B1, M2 కంపార్ట్‌మెంట్లలో అగ్నిప్రమాదం జరిగినట్లు గుర్తించామన్నారు. నర్సింగబల్లి వద్ద బీ1 ఏసీ బోగికి బ్రేక్‌లు పట్టేయడంతో మంటలు చెలరేగాయని అన్నారు. మంటలను చూసిన వెంటనే ఓ వ్యక్తి చెయిన్ లాగడంతో రైలు ఆగిందని తెలిపారు.

ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు చెప్పారు. ఒక కంపార్ట్మెంట్‌లో 82 మంది ప్రయాణికులు ఉండగా, మరో కంపార్ట్మెంట్‌లో 76 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు బయటకు వచ్చేశారని ఎస్పీ తుహీన్ సిన్హా వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

పోలీసులకే షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు

అప్సా ఎన్నికల పోలింగ్.. సచివాలయంలో సందడి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 29 , 2025 | 12:36 PM