ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు

ABN, First Publish Date - 2025-03-04T17:01:16+05:30

Supreme Court: బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌కు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతలపై బీఆర్‌ఎస్ పార్టీ వేసిన రెండు పిటిషన్లను సుప్రీం ధర్మాసనం విచారించింది.

న్యూఢిల్లీ, మార్చి 4: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపై పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం ఈరోజు(మంగళవారం) విచారణ జరిపింది. 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ నేతలు రెండు వేరు వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకటరావులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ పాడి కౌషిక్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్‌ వేశారు.


రెండు పిటిషన్లు కలిపి జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. బీఆర్‌ఎస్ తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని విషయాన్ని కోర్టు దృష్టి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌తో సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన సుప్రీం ధర్మాసనం.. తదుపరి విచారణ మార్చి 25వ తేదీకి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

Hall ticket issue: విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న కాలేజ్.. ఏం జరిగిందంటే

Congress Reviews: తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న మీనాక్షి నటరాజన్ ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - 2025-03-04T17:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising