Congress Reviews: తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న మీనాక్షి నటరాజన్ ..
ABN , Publish Date - Mar 04 , 2025 | 09:09 AM
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కార్యచరణ చేపట్టారు. అందులోభాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షాలను ఆమె నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్ర కాంగ్రెస్ (Congress) వ్యవహారాల బాధ్యురాలిగా మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan ) ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఆ క్రమంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ పార్లమెంట్ వారీగా మంగళవారం నుంచి సమీక్షలు (Reviews) చేయనున్నారు. గాంధీ భవన్‌లో 2 గంటల నుండి సమీక్షలు నిర్వహిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మెదక్, సాయంత్రం 5 గంటలకు మల్కాజ్ గిరి పార్లమెంట్‌పై సమీక్ష జరుపుతారు.
Read More..
బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్, మధ్యాహ్నం 2 గంటలకు అదిలాబాద్, సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంపై మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షలకు హాజరుకావాలని ఆయా నియోజకవర్గ మంత్రులు, ఇంచార్జీ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పోటీ చేసిన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులకు పిలుపిచ్చారు. పార్టీ పరిస్థితులు, సమస్యలు, పరిష్కార మార్గాలపై మీనాక్షి నటరాజన్ చర్చించనున్నారు.
మరోవైపు.. వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే పార్టీ ఫిరాయింపుల కారణంగా.. ఉప ఎన్నికల వచ్చే అవకాశముంది. ఆయా ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించే అవకాముందని సమాచారం. అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాంటి వేళ.. జిల్లాల్లో నియోజకవర్గాల స్థాయిలో ఉన్న లోపాలను ఎలా సరి చేసుకోని ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించవచ్చు. కాగా ఇటీవల వరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ వ్యవహారల బాధ్యురాలిగా దీపా దాస్ మున్షీ ఉన్నారు. ఆమె స్థానంలో మీనాక్షి నాటరాజన్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
అసెంబ్లీలో బడ్జెట్‌పై ప్రకటన చేయనున్న ప్రభుత్వం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News