Assembly: అసెంబ్లీలో బడ్జెట్‌పై ప్రకటన చేయనున్న ప్రభుత్వం
ABN , Publish Date - Mar 04 , 2025 | 07:56 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అత్యవసర చర్చగా విదేశాల్లో చదువుతున్న భారతీయ మెడికల్ విద్యార్థుల సమస్యలపై చర్చ జరగనుంది. మెడికల్ గ్రేడ్యుయేట్‌ల సమస్యలపై మంత్రి సత్యకుమార్ సమాధానాలు ఇస్తారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Budget Sessions) మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అలాగే 10 గంటలకు శాసన మండలి సమావేశాలు (Legislative Council Meetings) ప్రారంభమవుతాయి. ఉభయ సభలు (Both Houses) ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా 2025-26 బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం (AP Govt) ప్రకటన చేయనుంది. అనంతరం బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. కాగా సభ ప్రారంభమైన వెంటనే తెల్ల రేషన్ కార్డులు భూవివాదాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై సభ్యులు ప్రశ్నలు వేస్తారు... వాటికి సంబంధిత మంత్రులు సమాధానాలు ఇస్తారు.
ఈ వార్త కూడా చదవండి:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం..
మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో అత్యవసర చర్చగా విదేశాల్లో చదువుతున్న భారతీయ మెడికల్ విద్యార్థుల సమస్యలపై చర్చ జరగనుంది. మెడికల్ గ్రేడ్యుయేట్‌ల సమస్యలపై మంత్రి సత్యకుమార్ సమాధానాలు ఇస్తారు.
మరోవైపు శాసనమండలి క్వశ్చన్ అవర్‌లో కీలక ప్రశ్నలపై చర్చ జరగనుంది. బాలికల హాస్టల్‌లో సమస్యలు.. డీఎస్సీ నోటిఫికేషన్‌పై సభ్యుల ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇస్తారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, బీసీల సంక్షేమం, చేనేత కార్మికుల సమస్యలకు సంబంధించి కూడా మండలిలో ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి.
కాగా వైసీపీ ఐదేళ్ల పాలనలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయపడిపోయేవారు. అసెంబ్లీకి సుమారు 20 కిలోమీటర్ల పరిధి నుంచే ఆంక్షలు మొదలయ్యేవి. అప్పటి సీఎం జగన్ నివాసం వద్ద, అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేసేవారు. ప్రతి ఇంటి ముందు పరదాలు, దారి పొడవునా షాపులు మూసివేయించడం వంటివి సర్వసాధారణంగా జరిగేవి. అయితే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. పరదాలు లేవు. ప్రస్తుతం 525 మందితోనే భద్రత ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News