Akkineni Nagarjuna: నాంపల్లి కోర్టుకు నాగార్జున.. కొండా సురేఖ కేసులో స్టేట్‌మెంట్ రికార్డు
ABN, Publish Date - Sep 03 , 2025 | 08:43 PM
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కేసులో సినీ నటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. పరువు నష్టం దావా కేసులో నాగార్జున స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. హీరో నాగార్జునతో పాటూ ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. గతంలో కేటీఆర్‌పై విమర్శలు చేసిన సందర్భంలో మంత్రి కొండా సురేఖ.. నాగచైతన్య, సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కేసులో సినీ నటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. పరువు నష్టం దావా కేసులో నాగార్జున స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. హీరో నాగార్జునతో పాటూ ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. గతంలో కేటీఆర్‌పై విమర్శలు చేసిన సందర్భంలో మంత్రి కొండా సురేఖ.. నాగచైతన్య, సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నాగార్జున స్పందించారు.
తమ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చట్టపరమైన క్రిమినల్ చర్యలతో పాటు పరువునష్టానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియో క్లిప్పింగ్స్, సోషల్‌మీడియా లింక్స్‌తో నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో నాగార్జున, నాగ చైతన్య తమ స్టేట్‌మెంట్లను న్యాయమూర్తికి సమర్పించారు. వీరి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న న్యాయస్థానం.. ఈ కేసులో తదుపరి విచారణను చేపట్టనుంది.
Updated Date - Sep 03 , 2025 | 08:43 PM